Gold Price Today 5th January 2021: భారీగా పెరిగిన బంగారం ధరలు..
Gold Price Today in Hyderabad: బులియన్ మార్కెట్‌లో కొత్త సంవత్సరం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజా మరోసారి బంగారం ధర పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు(Gold Price Today) పుంజుకోగా, దేశ రాజధాని ఢిల్లీలో స్థిరంగా ఉన్నాయి.
Also Read: EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు!
Gold Rate Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.420 మేర భారీగా పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.51,600కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,300 అయింది.
Gold Rate Today In Delhi: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర (Gold Price Today) జనవరిలో స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర నిన్న ధరలోనే మార్కెట్ అవుతోంది. తాజాగా 10 గ్రాముల ధర రూ.53,520 వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,070 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
Also Read: SBI Credit Card Limit: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలని ఉందా.. ఇది చదవండి
నూతన సంవత్సరంలో సైతం బంగారం ధరలతో పోటీపడి వెండి ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీలో వెండి ధర తాజాగా రూ.2180 మేర భారీగా పెరిగింది. నేటి మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.70,300కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.2,100 భారీగా పుంజుకుంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.74,100 అయింది.
Also Read: EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి