Gold Rate Today: పసిడిని ఎవరూ పట్టించుకోవడం లేదా? మరోసారి పాతాళంలోకి ధరలు..తులంపై 7వేలు తక్కువ..నేటి ధరలు ఇవే
Gold Rate Today: బంగారం ధర గడిచిన నెలరోజుల్లో భారీగా తగ్గింది. ముఖ్యంగా గత నెల నవంబర్ ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. దాదాపు 84వేలకుపైగా చేరింది. అప్పటి నుంచి తగ్గుతూ వస్తూ నేడు 77వేలకు చేరింది. అంటే తులంపై దాదాపు 7వేల వరకు తగ్గిందని చెప్పవచ్చు.
అంతేకాదు బంగారం ధర లక్ష రూపాయలు అవుతుందని అంతా భావించారు. అందుకు తగ్గట్లుగానే పరిస్థితులు కూడా ఉండటంతో పసిడి ప్రియులు ఆందోళన చెందారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి.
బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధర తగ్గడానికి డాలర్ విలువ పెరగడం ఒక కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అమెరికా డాలర్ విలువ దాదాపు 84.75వేలకు చేరింది. ఇది చరిత్రలోనే అత్యధికం. డాలర్ ఈ స్థాయిలో పెరగడం కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమయ్యాయని చెప్పవచ్చు.
అమెరికాలో డాలర్ విలువ పెరిగే కొద్దీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బాండ్ మార్కెట్లో వైపు తరలించడం అనేది సహజంగా తమ పెట్టుబడులను సురక్షితంగా బాండ్ల ద్వారా వడ్డీ లభిస్తుంది.
ఇక స్టాక్ మార్కెట్లు కూడా బలోపేతం అవుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఇంతకాలం సురక్షితంగా భావించిన బంగారం నుంచి ఉపసంహరించుకుని నెమ్మదిగా స్టాక్ మార్కెట్లో, అమెరికా బాండ్ మార్కెట్లతోపాటు బిట్ కాయిన్ లపై పెట్టుబడి పెడుతున్నారు.
అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించినట్లయితే జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో మార్కెట్లు మరోసారి ఊపందుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా బంగారం ధర తగ్గేందుకు కారణం అయ్యే ఛాన్స్ కూడా ఉంది.