Gold Rate Today: కొత్త సంవత్సరం ముందు షాకిచ్చిన బంగారం ధరలు..డిసెంబర్ 30 సోమవారం బంగారం ధర ఎంత పెరిగిందంటే?
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు డిసెంబర్ 30వ తేదీ సోమవారం నాడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,536 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,100 ఉంది.
బంగారం ధరలు తగ్గడానికి కారణాలెన్నో ఉణ్నాయి. ముఖ్యంగా గోల్డ్ రేట్స్ తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా బంగారం నిల్వలు అంతర్జాతీయంగా హెచ్చుతగ్గులకు గురవ్వడం వల్ల బంగారానికి డిమాండ్ తగ్గుతుందని ఒక కారణంగా చెప్పవచ్చు. దీనికి తోడు డాలర్ బలం పుంజుకోవడం వల్ల ఇన్వెస్ట్ మెంట్ అటువైపు వెళ్లడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
బంగారం ధరలు తగ్గడానికి మరో కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని చెప్పవచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెద్దెత్తున స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. ఫలితంగా బంగారంపై పెట్టుబడులు తగ్గి డిమాండ్ కూడా తగ్గుతుంది. దీంతో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
బంగారం ధరలు తగ్గడానికి మరో ప్రధాన కారణం జనవరి చివరి వారంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టినట్లయితే అమెరికా రక్షణాత్మక వ్యాపార ధోరణి అవలంభించే ఛాన్స్ ఉంటుంది. ఇది బంగారం డిమాండ్ ను మరింత తగ్గించే ఛాన్స్ ఉంటుంది.
బంగారం ధరలు తగ్గడానికి దేశీయంగా కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బంగారం ధర తగ్గడానికి దేశీయంగా పండగలు, అదేవిధంగా వివాహ సీజన్ లేకపోవడం వల్ల కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి.