Gold Rate Today: కొత్త ఏడాదికి ముందు బంగారం కొనాలంటే ఇదే మంచి ఛాన్స్..నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయంటే 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,380 వద్ద ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,350 దగ్గర ట్రేడ్ అవుతోంది.
బంగారం ధరలు తగ్గుముఖం పట్టేందుకు ప్రధానంగా ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు కూడా ఒక కారణమని చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి అమెరికాలో నెలకున్న పరిస్థితులే కారణం అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా డాలర్ విలువ భారీగా బలపడటం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.
బంగారం ధర తగ్గడానికి మరో ప్రధాన కారణం అమెరికాలో బంగారం ధర తగ్గడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఔన్సు బంగారం ధర 2600 డాలర్ల సమీపంలో ట్రేడ్ అవుతోంది. ఇది కూడా గోల్డ్ రేట్ తగ్గడానికి ఒక కారణం అవుతుంది.
బంగారం ధర గత నెలలో ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. 84వేల రూపాయలతో రికార్డు స్థాయిలో పెరిగింది. ఇప్పుడు దాదాపు 8వేల రూపాయల వరకు తగ్గింది. దీంతో బంగారం కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
బంగారం ధరలు తగ్గుతుండటంతో నిపుణులు ఈ ట్రెండ్ ఎంత కాలం వరకు కొనసాగుతుందనే దానిపైన అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గేందుకు ప్రధాన కారణం డిమాండ్ తగ్గడమే అని చెబుతన్నారు.
అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల వైపు పెట్టడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయని చెప్పవచ్చు.