Gold News: పాతాళానికి బంగారం ధరలు..మూడోరోజు రూ. 2400 తగ్గిన పసిడి.. కొనేందుకు ఇదే మంచి సమయం
Today Gold Rate: దేశంలో బంగారం ధరలు పాతాళానికి చేరుకుంటున్నాయి. ఎవరెస్టు అంత ఎత్తుకు పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా నేలచూస్తున్నాయి. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన ట్రంప్..ఎఫెక్ట్ తో బంగారం ధర భారీగా తగ్గింది. అయితే పది గ్రాముల బంగారం ధర రూ. 60వేలకు దిగి వస్తుందని అంచనా వేశారు. కానీ తర్వాత మళ్లీ పుంజుకుంది. ఏకంగా 80వేలకు చేరుకుంది. అయితే ప్రస్తుతం ధరలు మాత్రం నేలచూస్తున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. ఈ రెండు రోజుల్లో 24క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై రూ. 2400 తగ్గింది. నేడు రూ. 1310 తగ్గింది. దీంతో రూ. 77వేల 240కి చేరుకుంది. 22క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులానికి రూ. 2200 తగ్గింది. దీంతో రూ. 70వేల 800కు చేరుకుంది.
అయితే బంగారానికి, స్టాక్ మార్కెట్లకు దగ్గరి సంబంధం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది పెట్టుబడి దారులు బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. బంగారం ధర పెరగడానికి కూడా ఇదే కారణం. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో నివసించినా సరే బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. దీంతోపాటు పశ్చిమాసియాలో యుద్ధం ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.
అమెరికా ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల బంగారం ధరులు హెచ్చుతగ్గులకు గురువుతుంటాయి. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చినట్లయితే స్టాక్ మార్కెట్లతోపాటు క్రిప్టో కరెన్సీ కూడా పుంచుకునే ఛాన్స్ ఉంటుంది. దీంతో పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను ఇప్పటి వరకు సేఫ్ పెట్టుబడిగా భావిస్తున్న బంగారం నుంచి స్టాక్ మార్కెట్, బిట్ కాయిన్ వైపు తరలించే ఛాన్స్ ఉంటుంది. దీంతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. బంగారం ధరలు ఈ మధ్య కాలంలో వేగంగా మార్పులకు లోనవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లకు బంగారం సున్నితమైన అంశంగా మారింది. ఫలితంగా ధరల హెచ్చుతగ్గులకు అవకాశం ఉంది. ఒకవేళ బంగారం ధరలు వేగంగా తగ్గితే పది గ్రాముల బంగారం ధర 60వేలకు పడిపోయే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.