Gold Rate In Hyderabad 28 June 2021: నేడు మిశ్రమంగా బంగారం ధరలు.. నిలకడగా వెండి ధర ట్రెడింగ్

Mon, 28 Jun 2021-2:05 pm,

Gold Rate In Hyderabad: గత ఏడాది నుంచి బులియన్ మార్కెట్ కాస్త అటుఇటుగా మార్కెట్ అవుతోంది. కరోనా ప్రభావం కొన్ని రోజులు ధరలు పుంజుకున్నా, ఆ వెంటనే భారీగా ధరలు దిగొస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగానలో బంగారం ధర స్థిరంగా ఉంది. ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు గత వారాంతం నుంచి వెండి ధరలు నిలకడగా ట్రేడింగ్ అవుతున్నాయి.

Also Read: EPFO Benifits: ఈపీఎఫ్ ఖాతాలున్నాయా, అయితే ఈ 5 EPF బెనిఫిట్స్ తెలుసుకోండి

Gold Rate In Hyderabad: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా బంగారం ధరలకు డిమాండ్ పెరగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.48,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,100 వద్ద నిలకడగా ఉంది.

ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయినా బులియన్ మార్కెట్‌పై కరోనా ప్రభావం మాత్రం తగ్గలేదు. తాజాగా ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారంపై రూ.60 మేర పెరిగింది. నేడు స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,310చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,260 అయింది.

Also Read: Bank Holidays In July 2021: జులై నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్, మీ బ్యాంక్ పనులు షెడ్యూల్ చేసుకోండి

ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి రూ.67,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.73,400 వద్ద ట్రేడింగ్ అవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link