EPS: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్.. ఇక పింఛను ఏ బ్యాంకు నుంచైనా పొందవచ్చు..
ఇప్పటి వరకు పింఛను కేవలం ఈపీఎఫ్‌ఓ మాత్రమే నిర్వహించేది ఇకపై పింఛను దారులు ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ డబ్బులను తీసుకోవచ్చు. ఇది 2025 జనవరిలో దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యా తెలిపారు. ఈయన ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీగా కూడా ఉన్నారు.
సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టం (CPPS) దీని ద్వారా పెన్షన్ పేమెంట్స ఆర్డర్ ట్రాన్స్‌ఫర్ అవసరం ఉండదు. లొకేషన్, బ్యాంకులు మారినప్పుడు ట్రాన్స్‌ఫర్ పెన్షన్ ఆర్డర్ అవసరం లేకుండానే 7.8 మిలియన్ల పింఛనుదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ విధానం ద్వారా పింఛనుదారులు తమ ఏ బ్యాంకు, బ్రాంచీ ద్వారానైనా పెన్షన్ పేమెంట్స ఆర్డర్ ట్రాన్స్‌ఫర్ అవసరం లేకుండానే సులభంగా పింఛను పొందవచ్చు. ఈ విధానం దీర్ఘకాలికంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందని మాండవ్య తెలిపారు ఇది ఈపీఎఫ్ఓ ఐటీ మోడ్రనైజేషన్‌లో భాగంగా తీసుకువచ్చిన సిస్టం అన్నారు.
ఈ కొత్త విధానం వల్ల పింఛనుదారులకు బ్యాంకుల చుట్టు తిరగాల్సిన పనిలేదు. వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ఉండదు. పెన్షన్ విడుదలైన వెంటనే మీ ఖాతాలో క్రెడిట్ అయిపోతాయి. ఈ విధానం వల్ల పింఛను పంపిణీలో ఖర్చు కూడా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.
ప్రస్తుతం కేవలం 4 బ్యాంకులతో మాత్రమే ఈపీఎఫ్ఓ ఒప్పందం కలిగి ఉంది. రానున్న కాలంలో ఆధార్ ఆధారిత పేమెంట్ పద్ధతిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.