Hyderabad To Goa: ఛలో గోవా.. నేడు సికింద్రాబాద్‌- వాస్కోడిగామా ట్రైన్ ప్రారంభం.. ఆగే స్టేషన్లు టిక్కెట్‌ ధరలు ఇవే..

Sun, 06 Oct 2024-7:38 am,

గోవా వెళ్లాలనుకునేవారు గతంలో డైరెక్ట్ ట్రైన్‌ అందుబాటులో ఉండటం తక్కువ. ఈ నేపథ్యంలో ఈ కొత్త రైలు నేడు అక్టోబర్ 6 ప్రారంభించడం హర్షణీయం. నేడు ఈ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ముఖ్యంగా గోవా వెళ్లాలనుకునేవారికి ఇది బంపర్‌ ఆఫర్. అయితే, సికింద్రాబాద్‌ - వాస్కొడిగామా ఎక్స్‌ప్రెస్‌ బై వీక్లీ అందుబాటులో ఉంటుంది. అంటే వారానికి రెండు రోజులు. బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది.  

గతంలో గోవాకు ట్రైన్లు అందుబాటులో ఉన్నా అవి నేరుగా ఉండటం చాలా తక్కువ అంతేకాదు ఈ ట్రైన్లలో బెర్తులు దొరకడం కూడా ప్రయాణీకులకు కష్టతరంగా మారేది. ఈ నేపథ్యంలో సౌత్‌ సెంట్రల్‌ ఈ ప్రకటనతో గోవా ప్రేమికులకు ఇది బంపర్‌ ఆఫర్‌గా మారింది.   

మళ్లీ తిరిగి గోవా నుంచి గురువారం, శనివారం బయలుదేరుతుంది. ఇక గోవాకు వెళ్లేవారు ముందుగానే బుక్‌ చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా ప్రధాన నగరమైన హైదరాబాద్‌ నుంచే గోవాకు బయలుదేరవచ్చు. నేడు ఈ ట్రైన్‌ ప్రారంభించనున్నారు. కానీ, సాధారణ సేవలను రైల్వే అక్టోబర్‌ 9 నుంచి అందుబాటులో ఉంచనుంది.  

నేడు ప్రారంభం కానున్న ఈ సికింద్రాబాద్‌- వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌, థర్డ్‌ ఎకానమీ, ఫస్ట్‌ క్లాస్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ నాలుగు బోగీలు సికింద్రాబాద్‌ నుంచి కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్‌, ధోన్, గుంతకల్లు, బళ్లారి, హోస్పేట్‌, కొప్పల్, హబ్బలి, ధార్వాడ్, లోండా, కులేం, సాన్వోర్డెమ, మడ్గావ్, వాస్కోడగామాకు చేరుకుంటుంది.  

1. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా -ఇక ఈ రైలు సేవలు అక్టోబర్‌ 9 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ట్రైన్‌ నంబర్‌ 17039 (బుధ, శుక్రవారాలు)09-10-2024  

2. వాస్కోడగామా నుంచి సికింద్రాబాద్ - ట్రైన్‌ నంబర్‌ 17040 (గురువారం, శనివారం) 10-10-204 అందుబాటులో ఉండనున్నాయి.  

ఇక రైలు టిక్కెట్ల ధరల విషయానికి వస్తే సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడగామాకు SL రూ. 440, థర్డ్ ఎకానమీ రూ.1100, 3 టైర్‌ ఏసీ రూ.1185, 2 టైర్ రూ.1700, ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ రూ.2860  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link