Salary Hike 2021-22: ఈ సంవత్సరం భారత్‌లో ఉద్యోగులకు ఎక్కువ జీతం, రెండంకెల increment, పూర్తి వివరాలు

Fri, 19 Feb 2021-3:55 pm,

కరోనా వైరస్ కారణంగా వేతనాలు, ఉద్యోగాలలో కోత పడింది. తాజాగా అన్ని రంగాలు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించడంతో ఉద్యోగ నియమాకాలు జరుగుతున్నాయి. అదే సమయంలో పాత ఉద్యోగులకు ఆయా సంస్థలు భారీగా వేతనాలు పెంచనున్నాయని తెలుస్తోంది.

Also Read: Paytm Offer: పేటీఎం బెస్ట్ ఆఫర్, కేవలం రూ.10 చెల్లించి ఈ ప్రయోజనాలు పొందండి

డెలాయిట్ టౌచ్ తోహ్మాట్సు ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్‌లో 2021లో 7.3 శాతం వేతనాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది 20 శాతం కంపెనీలు రెండంకెల ఇంక్రిమెంట్ ఇవ్వాలని యోచిస్తున్నాయని సర్వే పేర్కొంది.

Also Read: SBI Latest News: ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త, ఒక్క ఫోన్ కాల్ ద్వారా PIN జనరేట్ చేసుకోవచ్చు

కరోనా కారణంగా గతేడాది కేవలం 12 శాతం కంపెనీలు మాత్రమే రెండంకెల ఇంక్రిమెంట్ ఇస్తాయని అంచనా వేశారు. కాగా, గతేడాది 60 శాతం కంపెనీలు మాత్రమే తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చాయి.

Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి

లైఫ్ సైన్సెస్ మరియు ఐటీ రంగాలలో ఇంక్రిమెంట్ అధికంగా ఇవ్వనున్నారని అంచనా వేసింది. దాంతోపాటుగా రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు మరియు పునరుత్పాదక ఇంధన సంస్థలు సైతం ఓ మోస్తరు ఇంక్రిమెంట్ ఇస్తాయని భావిస్తున్నారు.

2019లో భారత్‌లో కంపెనీలు ఇచ్చిన సగటు ఇంక్రిమెంట్ 8.6%. కాగా, 2021లో ఇవ్వనున్న 7.3 శాతం కాస్త తక్కువే కానీ, ప్రస్తుత పరిస్థితులలో ఇది ఎక్కువ మొత్తంలో జీతాలు పెరగడమేనని నివేదికలు చెబుతున్నాయి.

Also Read: Bajaj pulsar 180 roadster: బజాజ్ పల్సార్ కొత్త బైక్ మార్కెట్‌లో త్వరలో..ధర ఎంతో తెలుసా

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link