Google servers down: గూగుల్ సర్వర్స్ ఎందుకు డౌన్ అయ్యాయంటే..

Tue, 15 Dec 2020-6:06 am,

గూగుల్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాకా హాయిగా గూగుల్ చేసుకుంటూ తమ పని తాము కానిచ్చిన వాళ్లు కొందరైతే... ఇంతకీ గూగుల్ సర్వర్స్ డౌన్ అవడానికి కారణం ఏంటంటూ అదే గూగుల్‌లో ఆరాతీస్తూ ఇంకొందరు నెటిజెన్స్ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో గూగుల్ సర్వర్స్ క్రాష్ అవడానికి గల కారణాలు ఏంటా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలిసింది ఏంటంటే...

గూగుల్ స్పోక్స్ పర్సన్ గూగుల్ సర్వర్స్ డౌన్ అవడంపై స్పందిస్తూ.. ఇంటర్నల్ స్టోరేజ్ కోటాలో ( Internal storage quota issue ) తలెత్తిన లోపం వల్లే ఈ సమస్య ఎదురై ఉండొచ్చని సందేహం వ్యక్తంచేశారు.

సాధారణంగా ఏయే పరిస్థితుల్లో సర్వర్స్ క్రాష్ అవుతుంటాయనే విషయంలో ఓసారి దృష్టిసారించినట్టయితే... సర్వర్ల నిర్వహణలో, లేదా కోడింగ్‌లో ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు ఆ మానవ త‌ప్పిదం కార‌ణంగా సర్వర్స్ క్రాష్ అవుతుంటాయి. నేడు గూగుల్ సర్వర్స్ డౌన్ ( Google servers crashed ) అయిన విషయంలో జరిగింది కూడా అటువంటిదే అయ్యుండవచ్చు అని మొదట సైబర్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేశారు.

అలాగే సర్వర్స్ సెక్యురిటీలో లోపాలు ఉన్నట్టయితే.. ఆ లూప్ హోల్స్‌ని ఆధారంగా చేసుకుని హ్యాకర్స్ సైబ‌ర్ దాడులకు ( Cyber attacks ) పాల్పడే ప్ర‌మాదం ఉంటుంది. అదే కానీ జరిగితే సైబర్ దాడి తీవ్రతను బట్టి ఒక్కోసారి సర్వర్స్ రిస్టోర్ అయ్యే సమయం కూడా పెరగొచ్చు.

సర్వర్స్ వర్కింగ్ డేటా సెంట‌ర్‌లో ఉన్న మెషినరిలో ఏమైనా లోపాలు తలెత్తినట్టయితే.. ఆ లోపాలు సర్వర్స్‌పై పడతాయి. ఫలితంగా స‌ర్వ‌ర్లు క్రాష్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో ఉన్న బ‌గ్స్ ( Bugs in OS ) కూడా స‌ర్వ‌ర్లు డౌన్ అవ‌డానికి కారణం అవుతాయి అంటున్నారు సైబర్ ఎక్స్‌పర్ట్స్. సర్వర్స్‌ క్రాష్ అయ్యేలా చేసిన బగ్స్‌ని గుర్తించి డీబగ్ ( Debugging ) చేసేంతవరకు సర్వర్స్ రిస్టోర్ అవడం అసాధ్యం.  

Also read : SBI alert: ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. అప్రమత్తం కాకుంటే అంతే సంగతి!

Also read : Debit Cards and credit cards data leaked: 70 లక్షల ATM cards, credit cards డేటా లీక్

Also read : Best savings schemes: నెలకు రూ.10 వేలు పొదుపు చేయండి.. 16 లక్షలకుపైనే పొందండి..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link