Half Day Schools: బడి పిల్లలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నవంబర్ 6 నుంచి బడి ఒక్క పూటే..
ఇక రేపటి నుంచి తెలంగాణలో కులగణన సర్వే ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు పాల్గొంటారు. టీచర్లే ఇంటింటికి తిరిగి కులగలను సర్వే చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో ఉన్న ప్రతి పల్లె పల్లెల ఈ కులగణన సర్వే జరపబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 36 వేలకు పైగా ఎస్జీటీలకు సంబంధించిన సేవలను వినియోగించుకోబోతున్నట్లు తెలిపింది. దీంతోపాటు దాదాపు 3 వేలకు పైగా ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్స్, 6 వేలకు పైగా ఎంఆర్సీలు ఈ సర్వేల్లో వివిధ భాగాల్లో పాల్గొనబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ కుల కులగణనలో భాగంగా 50 వేలకు పైగా టీచింగ్ స్టాఫ్ లు వినియోగించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ ఆరవ తేదీ నుంచి విద్యార్థులకు ఒంటిపూట బడులను ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఒంటి పూట బడులనేవి కేవలం కొన్ని తరగతులకు మాత్రమే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఉన్నత పాఠశాలలో అయితే తక్కువ తరగతుల వారికి ఒంటి బూటబడులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారిక సమాచారం.
అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ఉదయం పూట యధావిధిగా ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పి.. మధ్యాహ్నం పూట కులగణన సర్వేలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఉదయం తొమ్మిది గంటల వరకు ఉపాధ్యాయులు స్కూల్లోనే పనిచేసి ఆ తర్వాత ఈ సర్వేలో పాల్గొంటారని సమాచారం.
ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్ అయితే ఈ కులగణన సర్వే సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి కేవలం మధ్యాహ్నం ఒక గంట వరకు మాత్రమే ఉండాలని విద్యాశాఖ ప్రకటించింది. ఆ తర్వాత ఉపాధ్యాయులంతా కులగణన సర్వేలో పాల్గొనాలని తెలిపింది.