Happy Birthday Kapil Dev: 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్.. ఆసక్తికర విషయాలు
Happy Birthday Kapil Dev: నేడు భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(Kapil Dev) 62వ పుట్టినరోజు. భారత క్రికెట్‌కు జీవం పోసిన అత్యుత్తమ ఆటగాళ్లలో కపిల్ దేవ్ ఒకరు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం... (Twitter Photo)
ఏ అంచనాలు లేకుండా వెళ్లిన Team India జట్టు 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో తొలిసారి వన్డే ప్రపంచ కప్ కైవసం చేసుకుంది. బ్యాటుతో పాటు బంతితోనూ రాణించాడు కెప్టెన్ కపిల్ దేవ్. (Image Credits: Twitter/@ChennaiIPL)
1983 వన్డే వరల్డ్ కప్‌లో 60.60 సగటుతో 303 పరుగులు సాధించి టాప్ 5 స్కోరర్‌గా నిలిచాడు.
Also Read: Kapil Dev about Dhoni: ధోనీ ఆటపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచంలో మేటి ఆల్ రౌండర్ అయిన కపిల్ దేవ్ వన్డేల్లో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.
కపిల్ దేవ్ 9,031 అంతర్జాతీయ క్రికెట్ పరుగులు సాధించారు, 687 వికెట్లు పడగొట్టారు
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకూ 400 వికెట్లు పడగొట్టడంతో పాటు 5000కు పైగా టెస్టు పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కపిల్ దేవ్
Also Read: 1983 Cricket World Cup : భారత్ విశ్వవిజేతగా నిలిచిన మ్యాచ్ నుంచి ఆసక్తికరమైన అంశాలు
పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్‌ను హర్యానా హరికేన్ అని పిలుచుకుంటారు
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తీరిక వేళలో గోల్ఫ్ ఆడేవారు.
Also Read: Indian Cricketers Retired In 2020: ఈ ఏడాది రిటైరైన భారత క్రికెటర్లు వీరే
1983లో కపిల్ దేవ్ తొలిసారిగా తన కెప్టెన్సీలో భారత్‌కు ప్రపంచ కప్ అందించగా.. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ రెండో వరల్డ్ కప్‌ను సాధించాడు. (PTI Photo)
కపిల్ దేవ్ బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఈ దిగ్గజ ఆల్ రౌండర్ పాత్ర పోషించాడు. 1983 వన్డే వరల్డ్ కప్ విజయాన్ని మూవీలో చూడవచ్చు.