1983 ICC World Cup : 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ (1983 Cricket World Cup ) లో భారత్ ఓటమి అంచునుంచి తప్పించుకోవడమే కాదు.. చరిత్రను తిరగరాసి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది. కపిల్ దేవ్ టీమ్ ( Kapil Dev ) జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయానికి నేటితో 37 ఏళ్లు పూర్తయ్యాయి. కపిల్ దేవ్ సారథ్యంలో వెస్టిండీస్ ( India Vs West Indies ) తో తలపడిన భారత క్రికెట్ టీమ్ ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. వెస్టిండీస్ జట్టు పరిస్థితి ఇప్పుడు దిగజారిందేమో కానీ అప్పట్లో వెస్టిండీస్ అంటే క్రికెట్‌లో బాహుబలి టీమ్ లాంటిది అనే పేరుండేది. అప్పట్లో వరుసగా ప్రపంచ కప్‌లు గెలుస్తోన్న జట్టు అది. అదే సమయంలో భారత్ కేవలం 73 పరుగులుకే 7 వికెట్లు కోల్పోయింది. అంటే టాప్ అండ్ మిడిల్ అర్డర్ పూర్తిగా విఫలం అయింది. మొత్తంగా వెస్టిండీస్‌కు కేవలం 183 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. దాంతో గ్రౌండ్‌లో ఉన్న వాళ్లంతా.. విండీస్ ఆడుతు పాడుతూ గెలుస్తుంది అనుకున్నారు.
#OnThisDay in 1983, India won their maiden Men's @cricketworldcup title 🏆
Kapil Dev and his side stunned defending champions West Indies, beating them by 43 runs in a memorable final at Lord's 🙌 pic.twitter.com/DVchvVLH5P
— ICC (@ICC) June 25, 2020
కానీ క్రికెట్‌లో ( Cricket ) ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అంటారుగా.... ఈ మ్యాచ్‌లో కూడా సరిగ్గా అదే జరిగింది. అద్భుతం జరిగింది. భారత బౌలర్లు విండీస్ టీమ్‌ను 140 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇక్కడ తమాషా విషయం ఏంటంటే.. 73 పరుగులకే 7 మంచి కత్తి లాంటి భారత బ్యాట్స్‌మెన్ వెనుతిరగ్గా.. 90 పరుగుల వద్ద 9 మంది భారత బ్యాట్స్ మెన్ ఔట్ అయ్యారు. లార్ట్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఇలా తొలి ప్రపంచ కప్‌ను అందుకుని ప్రపంచానికి తన సత్తా చాటింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు నేటితో 37 సంవత్సరాలు పూర్తి కావడంతో ఐసీసీ ( ICC ) ట్వీట్ చేసి నాటి చిత్రాన్ని పంచుకుంది.