Saffron Benefits: కుంకుమ లాభాలు తెలిస్తే, ధర గురించి పట్టించుకోరు

Sun, 08 Oct 2023-6:25 pm,

డిప్రెషన్ దూరం

కుంకుమలో ఉండే కొన్ని రకాల పోషకాలు సెరిటోనిన్ వంటి న్యూరో ట్రాన్స్ మిట్టర్లను రెగ్యులేట్ చేస్తాయి. ఫలితంగా డిప్రెషన్ దూరమౌతుంది. మూడ్ బాగుంటుంది. 

మధుమేహం నియంత్రణ

మధుమేహం నియంత్రించేందుకు కుంకుమ అద్భుతంగా ఉపయోగపడుతుందని ప్రపంచంలోని వివిధ అధ్యయనాల్లో రుజువైంది. కుంకుమ సేవించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. 

ఇమ్యూనిటీ బూస్ట్

కుంకుమలో ఉండే వివిధ రకాల పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుతాయి. 

జ్ఞాపకశక్తి మెరుగుదల

కుంకుమ సహాయంతో జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. తరచూ మర్చిపోయే అలవాటుండేవాళ్లు కుంకుమ తప్పకుండా సేవించాలి. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అర్జీమర్స్ వంటి వ్యాధులకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

కుంకుమతో కంటికి ప్రయోజనం

కుంకుమలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రెటీనాను రక్షించడంలో దోహదపడతాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. మ్యాక్యులర్ డీజనరేషన్, కేటరాక్ట్ వంటి కంటి సమస్యల్నించి కుంకుమ కాపాడుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link