Health Benefits Of Neem Leaves: చేదుగా ఉండే వేప ఆరోగ్యానికి ఔషధం.. ఈ ప్రయోజనాలు తెలుసా

Wed, 30 Sep 2020-3:20 pm,

ఎన్నో ఔషధ గుణాలను (Health Benefits Of Neem Leaves) తనలో ఇముడ్చుకున్న చెట్టు వేప చెట్టు. ప్రాచీన కాలం నుంచి దీన్ని ఇంట్లో తయారుచేసే ఔషధాలలో వినియోగిస్తున్నారు. వేప ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు మరియు బెరడు.. అన్నింటిని వ్యాధి చికిత్సలో వినియోగిస్తారు. వేప చెట్టును ‘21 వ శతాబ్దపు చెట్టు’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. రోజూ తాజా వేప ఆకులు తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఇనుము, కాల్షియం మరియు ఫైబర్ వంటివి లభిస్తాయి. వాస్తవానికి వేప ఆకులను పరగడుపున తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వేప రసం తాగితే ఇన్‌ఫెక్షన్ల నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది. వేప ఆకుల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు (Health Benefits Of Eating Neem Leaves) ఇక్కడ తెలుసుకుందామా.. (Image Credit: thehealthsite)

వేప ఆకులు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఖాళీ కడుపు (Empty Stomach)తో వేప ఆకులు తినడం వల్ల రక్తంలోని విషపూరిత పదార్థాలను, మలినాలను తొలగిస్తుంది. మరియు కొన్ని రకాల క్యాన్సర్ బారిన పడకుండా చేస్తుంది. (Image Credit: thehealthsite)

వేప ఆకులు యాంటీ ఫంగల్ లక్షణాలను (Neem leaves have antifungal properties) కలిగి ఉంటాయి. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తుంది. అస్పెర్‌గిల్లస్, కాండిడా అల్బికాన్స్ మరియు మైక్రోస్పోరం జిప్సం వంటి శిలీంధ్ర వ్యాధి కారకాలపై వేప ఆకులతో తయారు చేసిన ఇథనాల్, సజల మరియు ఇథైల్ విశ్రమం పని చేస్తుంది.  (Image Credit: thehealthsite)

పరగడుపున (Empty Stomach)తో వేప ఆకులు తినడం వల్ల ఇ.కోలి, సాల్మానెల్లా, మరియు క్లెబ్సిఎల్లా వంటి హానికారిక బ్యాక్టీరియాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని అందిస్తుంది.  (Image Credit: thehealthsite)

వేప ఆకులు చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మాన్ని హానికారక క్రిముల నుంచి కాపాడటంతో పాటు కొత్తగా జీవకాంతిని నింపుతుంది. సోరియాసిస్, తామర, మొటిమలు వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధుల చికిత్సలో వేప ఆకులను వాడతారు.   (Image Credit: thehealthsite)

వేప ఆకులు తినడం వల్ల డయాబెటిస్ (షుగర్ వ్యాధి) ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని వేప ఆకులు తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. తరచుగా వేప ఆకులు తినడం, లేక వేప రసం తాగేవారిలో షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు తక్కువ.   (Image Credit: thehealthsite)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link