Blueberry: నీలిరంగులో చూడడానికి చిన్న పండే.. కానీ మనకు సంపూర్ణ ఆరోగ్యం
ఆరోగ్య ప్రయోజనాలు: బ్లూ బెర్రీస్ మధుమేహాన్ని నివారించడమే కాకుండా చర్మాన్ని అందంగా ఉంచుతుంది.
జ్ఞాపక శక్తి: బ్లూబెర్రీస్ తినమని చెప్పడమే కాదు. బ్లూబెర్రీస్ కండరాలను బలోపేతం చేయడానికి.. మెదడు కార్యకలాపాలను ప్రేరేపిస్తాయి.
ఆరోగ్యానికి మేలు: బ్లూబెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్‌లు రక్తపోటు, మధుమేహం, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
చక్కటి ఔషధం: కీళ్లనొప్పులు, ఆస్తమా, కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలకు కూడా బ్లూబెర్రీ చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది.
మూత్ర సమస్యలు: బ్లూబెర్రీస్ మూత్ర విసర్జనలో సమస్యలను తగ్గిస్తాయి. మూత్రపిండాల నుంచి విషాన్ని బయటకు పంపేందుకు బ్లూబెర్రీ దోహదం చేస్తుంది.
జీర్ణ సమస్యలు: బ్లూబెర్రీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
చక్కెర స్థాయి: బ్లూబెర్రీస్‌లో ఉండే అధిక ఆల్కలాయిడ్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
చర్మ సౌందర్యం: బ్లూబెర్రీస్‌లోని విటమిన్ సీ, ఈ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి మెరిసే.. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి.
గుండె ఆరోగ్యం: బ్లూబెర్రీస్ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. దీంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
పొట్టు చుట్టూ: కడుపు చుట్టూ ఉన్న కొవ్వును (బెల్లీ ఫ్యాట్) కరిగించడానికి బ్లూబెర్రీస్ దోహదం చేస్తాయి.
నిరాకరణ: ఈ వార్తలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. దీనిని జీ న్యూస్ ధ్రువీకరించడం లేదు. వైద్య నిపుణుల సలహా మేరకు మీర వీటిని ప్రయత్నించండి