Healthy snacks: సాయంత్రం పూట జంక్ ఫుడ్ బదులు హెల్దీ స్నాక్స్.. బరువు సమస్య లేకుండా..!

Fri, 02 Aug 2024-11:36 pm,

సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఏదో ఒకటి తినాలి అనుకుంటారు. అయితే ఇటువంటి సమయంలో ఈజీగా ఉంటుంది కదా అని.. ఏదో ఒక ఫుడ్ పెట్టడం వల్ల వాళ్లకి ఆరోగ్యం పాడవడమే కాకుండా ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంది. మరి సాయంత్రం పూట హ్యాపీగా తినడానికి హెల్దీ స్నాక్స్ ఏమిటో తెలుసుకుందాం..

జీడిపప్పులు, బాదం పప్పులు, వాల్ నట్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ లాంటి మంచి పౌష్టిక తత్వాలు కలిగిన నట్స్ను ఈవినింగ్ స్నాక్స్ గా ఇవ్వచ్చు. అయితే ఇలా డైరెక్ట్ గా తినడం కంటే కూడా కాస్త రోస్ట్ చేసిన నర్స్ ని బెల్లం పాకంలో కలిపి చిక్కిలుగా చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ఇవి తినడం వల్ల మంచి ప్రోటీన్లు, ఫైబర్లు శరీరానికి అందడంతో పాటు వారికి అవసరమైన శక్తి కూడా వస్తుంది.

పిల్లలు కాస్త తీపి వస్తువులు తినడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు ఖర్జూరం మంచి ఆప్షన్. పిల్లలు ఖర్జూరం తినడానికి ఇష్టపడకపోతే వాటి మధ్యలో నట్స్ పెట్టి చాక్లెట్లో డిప్ చేసి.. ఫ్రీజ్ చేయండి. హెల్ది డేట్స్ చాక్లెట్స్ ఇంట్లోనే రెడీ అవుతాయి. వీటిలో క్యాలరీలు తక్కువ ఉండడంతో పాటు రుచిగా కూడా ఉంటాయి.

పూల్ మఖానాలో.. సోడియం, కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఇందులో పోషక విలువలు మెండుగా ఉంటాయి. అందుకే ఈ సూపర్ ఫుడ్ ని కాస్త నేతిలో వేయించి పిల్లలకు పెడితే ఎంతో మంచిది.

నానబెట్టిన తెల్ల చనగలు తేమ లేకుండా ఆరపెట్టి వేయించి పిల్లలకు తినడానికి ఇవ్వవచ్చు. ఇందులో అధిక మోతాదులో లభ్యమయ్యే ప్రోటీన్లు శరీరానికి అవసరమైన పోషక విలువలను అందించి కండరాలను దృఢంగా చేస్తాయి.

పిల్లలకి సాయంత్రం పూట బొరుగులతో కూడా చాలా రకాల స్నాక్స్ చేసి పెట్టవచ్చు. ఇవి చేయడం సులభంగా ఉంటుంది పైగా పిల్లలు ఇష్టంగా కూడా తింటారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link