Heavy Rains: రెడ్ అలెర్ట్.. ఫెంగల్ ఎఫెక్ట్‌తో నేడు రేపు భారీవర్షాలు, ఈ జిల్లాల్లో వరదలు..
తీరం దాటిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మరి కొన్ని జిల్లాల్లో వరదల ప్రమాదం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఈ తీవ్ర తుఫాను ఎఫెక్ట్‌తో ముఖ్యంగా ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నేడు రేపు రెండు రోజులపాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 90 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయి.
ఈ నేపథ్యంతో తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేశారు. మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను ఎఫెక్ట్ వల్ల ఇప్పటికే పలు విమాన సేవలు కూడా రద్దు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను కూడా ఇప్పటికే మంత్రులతో సమీక్ష కూడా నిర్వహించారు. తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్‌తో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా భద్రాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగ్, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.