Hero Xpulse 200 4V Pro Dakar Price: రూ.1 లక్షకే Hero అడ్వెంచర్ బైక్.. ఫీచర్స్ మాములుగా లేవు గురూ..
హీరో కంపెనీ గతంలో విడుదల చేసిన తమ అడ్వెంచర్ బైక్ Xpulse ను అప్డేట్ వేరియంట్ లో మళ్లీ తమ కస్టమర్స్ కి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బైక్ Hero Xpulse 200 4V Pro Dakar పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్లతో పాటు అది తక్కువ ధరలో లభిస్తోంది. అలాగే క్లాసిక్ లుక్ తో అందుబాటులోకి ఉంది.
ఈ Hero Xpulse 200 4V ప్రో డాకర్ అడ్వెంచర్ బైక్‌కు సంబంధించిన ఫీచర్ల వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ ట్రిప్ మీ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక ఇవే కాకుండా గత మోడల్ కు అప్డేట్గా LED హెడ్‌లైట్, LED ఇండికేటర్స్ను కలిగి ఉంటాయి.
ఇక ఈ అడ్వెంచర్ బైక్లో ముందు భాగంతో పాటు వెనక భాగం చక్రాలకు డిస్క్ బ్రేక్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతోపాటు ట్యూబ్ లెస్ టైర్లు ప్రత్యేకమైన అలైవీల్స్ కూడా లభిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాలు చేసే సమయంలో మొబైల్ కి చార్జింగ్ పెట్టుకునేందుకు ప్రత్యేకమైన యుఎస్బి చార్జింగ్ సాకెట్ను కూడా అందిస్తోంది. దీంతోపాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి..
ఈ Hero Xpulse 200 4V ప్రో డాకర్ బైక్ కు సంబంధించిన ఇంజన్ వివరాల్లోకి వెళితే.. ఇది 199.6 cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీని ఇంజన్ 18.5 Bhp శక్తితో పాటు 17.35 Nm టార్క్‌ను ఉత్పత్తి ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది గత మోడల్ బైక్ తో పోలిస్తే అద్భుతమైన మైలేజీని అందిస్తుంది.
ఇక ఈ అడ్వెంచర్ బైక్ ధర వివరాల్లోకి వెళితే హీరో కంపెనీ దీనిని మార్కెట్లోకి ధర రూ. 1.67 లక్షల ఎక్స్-షోరూమ్ తో విక్రయిస్తోంది. అయితే ఈ మోటార్ సైకిల్ ను న్యూ ఇయర్ ఆఫర్స్ లో భాగంగా కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు ధర లభించబోతోంది. ఈ మోటార్ సైకిల్ ఇవే కాకుండా అనేక రకాల శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.