Hospital Bill: హాస్పిటల్లో బిల్లు కడుతున్నారా? ఒకసారి ఆగండి.. ఇది చూస్తే ఇక మీకు నో బిల్..
ప్రస్తుత కాలంలో హాస్పిటల్ కి వెళ్లాలంటేనే ఖర్చుల భయంతో ప్రజలు భయపడిపోతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లడం ఒక ఎత్తు అయితే, అక్కడ బిల్లు కట్టలేక తిప్పలు పడడం మరొక ఎత్తు. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల నుండి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరడం వల్ల రూ.5లక్షల వరకు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా 5 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ పొందొచ్చు. మరి ఆ పథకం ఏంటో ఇప్పుడు చూద్దాం.
అదే పీఎంజే పథకం.. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం. ఇది "హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్" అని చెప్పవచ్చు. 55 కోట్ల మంది ప్రజలు ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో ఎవరు ఉన్నారు అనే విషయం ఎలా చెక్ చేయాలి అనే విషయానికి వస్తే.. mera.pmjay.gov.in అని అధికారిక వెబ్సైట్ కి వెళ్లి.. మొబైల్ నెంబర్ అలాగే పర్సనల్ డీటెయిల్స్ ను ఎంటర్ చేస్తే అక్కడ మీరు అందులో జాయిన్ అయ్యారా లేదా అనే విషయం తెలుస్తుంది.
ఒకవేళ ఇప్పటివరకు ఇందులో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అయ్యి 5 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ పొందండి. లేదంటే 14555 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరి ఈ స్కీము ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి మాత్రమే కాదు ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా కవర్ చేయబడింది.
దాదాపు రూ.5 లక్షల వరకు మీరు ఉచితంగా ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక్కొక్క ఫ్యామిలీకి ఐదు లక్షల రూపాయలు అంటే ఉచితంగా ఇంత మొత్తం మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే అని చెప్పాలి.
ఇక ప్రధానమంత్రి జెన్ యోజన పథకం ఎన్నో కుటుంబాలలో వెలుగులు నింపాయని చెప్పవచ్చు. ఒక కుటుంబానికి ఏడాదికి ఐదు లక్షల రూపాయలు అంటే ఇక ఏ మాత్రం హాస్పిటల్ ఖర్చులు భరించాల్సిన అవసరం ఉండదని ప్రజల సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.