Healthy Breakfast: రోజూ ఉదయం ఓట్స్ తింటే చాలు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ మాయం
నిద్ర
ఓట్స్‌లో కూరగాయలు, పండ్లు, నట్స్ చేర్చి వండితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మంచి నిద్ర కూడా పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం.
చర్మ సంబంధిత సమస్యలు
చర్మం సంబంధిత సమస్యల్నించి విముక్తి పొందేందుకు ఓట్స్ చాలా ఉపయోగపడతాయి. ఓట్స్ కారణంగా కొలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మానికి నిగారింపును తీసుకొస్తుంది. ముఖంపై దురద, స్వెల్లింగ్ , ర్యాషెస్ వంటి సమస్యలుంటే తొలగిపోతాయి. పింపుల్స్ కూడా దూరమౌతాయి.
చెడు కొలెస్ట్రాల్
చెడు కొలెస్ట్రాల్‌తో చాలా సమస్యలు ఎదురౌతాయి. గుండె వ్యాధులు, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు వంటివాటికి కారణం కొలెస్ట్రాల్. అయితే ఓట్స్ తినడం వల్ల ఈ సమస్య తొలగిపోతుంది. ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలుంటాయి.
బ్లడ్ షుగర్ లెవెల్స్
డయాబెటిస్ రోగులకు సైతం ఓట్స్ మంచి ఆహారం. ఓట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.
కడుపు సంబంధిత సమస్యలు
ఉదయం తీసుకునే అల్పాహారం హెల్తీగా తేలిగ్గా ఉండాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్స్ ఇందుకు మంచి ప్రత్యామ్నాయం. రోజూ ఓట్స్ తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.