WhatsApp: వాట్సాప్‌లో పొరపాటున ఫొటోలు డిలీట్ చేశారా..? ఈ ట్రిక్స్‌తో తిరిగి పొందండి
వాట్సాప్ ఫొటోలు, వీడియోలు మన ఫోన్ గ్యాలరీలో డిఫాల్ట్‌గా సేవ్ అవుతాయి. మీరు వాట్సాప్ నుంచి వీటిని తొలగించినా.. గ్యాలరీకి వెళ్లి చూడగలరు. గూగుల్ ఫొటోలలో సేవ్ అయి ఉంటాయి.
యాప్ చాట్‌లు, మీడియాను ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ డ్రైవ్‌కు, iOS వినియోగదారుల కోసం iCloudకి బ్యాకప్ చేస్తుంది. రోజువారీ బ్యాకప్ తర్వాత ఫైల్స్ తొలగించినా.. గూగుల్ డ్రైవ్ లేదా iCloud నుంచి బ్యాకప్‌ని పొందవచ్చు.
ముందుగా మీ స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్‌ను అన్‌స్టాల్ చేసి.. మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. అదే నంబర్‌తో మళ్లీ లాగిన్ అవ్వండి.
మీరు బ్యాకప్ నుంచి డేటాను పునరుద్ధరించమని ఓ నోటిఫికేషన్ వస్తుంది. దానిని అంగీకరించండి. సెటప్ పూర్తయిన తర్వాత.. మీడియా ఫైల్స్, మెసేజ్‌లు తిరిగి వస్తాయి.
మీడియా ఫోల్డర్ నుంచి వాట్సాప్ మీడియాని పునరుద్ధరించే ఎంపిక ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ముందుగా File Explorer యాప్‌ను తెరవండి. వాట్సాప్ ఫోల్డర్‌కి వెళ్లి.. మీడియా, వాట్సాప్ ఫొటోల ఫోల్డర్‌కి వెళ్లండి. ఇక్కడ మీరు అన్ని ఫొటోలను చూడొచ్చు. ఇక్కడ మీరు డిలీట్ చేసిన ఫోటోలు లేదా మీడియాను కూడా పొందవచ్చు.