TGSPDCL: జూలై నెల కరెంటుబిల్లు ఎలా కడుతున్నారు? టీజీఎస్‌పీడీసీఎల్ యాప్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా చెల్లించండి..
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) కరెంటు బిల్లుల చెల్లింపుల్లో కొత్త ఆదేశాలను జారీ చేసింది. 2024 జూలై 1 నుంచి ఈ మార్పులు జరిగాయి. ఈ సందర్భంగా కరెంటు బిల్లు చెల్లింపులు టీజీఎస్‌పీడీసీఎల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో చేయాలని సూచించింది. థర్డ్ పార్టీల జోక్యానికి చరమగీతం పాడింది.
బిల్లు చెల్లింపులు ఇలా.. 2024 జూలై 1 నుంచి టీజీఎస్‌పీడీసీఎల్ కరెంటు బిల్లులు థర్ట్ పార్టీ యాప్‌లు అంటే ఫోన్ పే, గూగుల్ పే, ఫేటీఎం ద్వారా చెల్లింపులను ఇప్పటికే నిలిపివేసింది. ఇది ఆర్‌బీఐ ఆదేశాల మేరకు జరిగింది.
ఈ నెల కరెంటు బిల్లులను టీజీఎస్‌పీడీసీఎల్ యాప్ ద్వారా చెల్లించడం ఎలా? ముందుగా టీజీఎస్‌పీడీసీఎల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. దీనికి కింద ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటించండి. టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది రెండూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్స్‌లో అందుబాటులో ఉంది.
ఆ తర్వాత సర్వీస్ రిజిస్ట్రర్ చేసుకోవాలి. మీ కరెంటు బిల్లు యూనిక్ సర్వీస్ కోడ్ నంబర్ ఎంటర్ చేయాలి. మీ ఫోన్ నంబర్ నమోదు చేయాలి. ఓటీపీ వస్తుంది. దీంతో రిజిస్టర్ చేసుకోవాలి.
బిల్ పే.. టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 'Pay Bill' ఆప్షన్ కనిపిస్తుంది ఆ తర్వాత పేమెంట్ విధానంలో టీ వ్యాలెట్, బిల్ డెస్క్ పేమెంట్ కనిపిస్తుంది. తద్వారా బిల్ పేమెంట్ పూర్తి చేయాలి. కరెంటు బిల్లు చెల్లింపు పూర్తవుతే మీకు కన్పర్మెషన్‌కు ఓ నోటిఫికేషన్ వస్తుంది.
టీజీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా బిల్ పేమెంట్స్ చేయడమేకాదు ఇందులో ఇతర సదుపాయాలు విద్యుత్ వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్నాయి. పవర్ బిల్‌కు సంబంధించిన కంప్లైయింట్స్ కూడా ఇవ్వచ్చు. ఓల్టేజ్ మార్పులు, విద్యుత్ కోతలు, మీటర్‌లో సమస్యలు, పవర్ ఓటేజ్, బిల్లింగ్ సంబంధిత సమస్యలకు కూడా కంప్లైయిట్ చేయవచ్చు.
అయితే, ఇటీవలె రానున్న కాలంలో కరెంటు బిల్లులపైనే ఏ నెలకు ఆ నెల సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ చేసే విధానాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. దీంతో విద్యుత్ వినియోగదారులు నేరుగా కరెంటు బిల్లుపై ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లు చెల్లింపులు మరింత ఈజీగా చెల్లించవచ్చు.