Rama Rajya: అయోధ్యలో రాముడి పాలన ఎలా సాగింది? శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు?

Fri, 27 Nov 2020-1:55 pm,

రాముడి పాలన (Lord Shri Ram Kingdom and Ruling ) అత్యుత్తమంగా సాగింది. నేటికీ ఆయన పాలన దక్షత గురించి ప్రపంచం కీర్తిస్తుంది.

శ్రీ రాముడి రాజ్యంలో ప్రతీ వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించేవారు. మంచి పనులు చేసేవారు.

శ్రీ రాముడి రాజ్యంలో (Lord Shri Ram Kingdom ) బాధలు ఉండేవి కావు. క్రూర జంతువుల నుంచి ప్రజలకు ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. వ్యాధుల విషయంలో ఎలాంటి బిడియం ఉండేది కాదు.

శ్రీ రాముని పాలనలో దొంగతనాలు, దోపిడీలు ఉండేవి కావు. సమానత్వం ఉండేది. యువత చురుకుగా ఉండేది.  

శ్రీ రాముని పాలనలో ఏ ప్రాణికి కష్టం కలిగేది కాదు. అన్ని ప్రాణులు సుఖంగా జీవించేవి. రాముడి కరుణ కటాక్ష వీక్షణతో అన్ని ప్రాణులు హింసను విడనాడేవి.

ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు

శ్రీ రాముని పాలనలో ప్రజలు సంపూర్ణ ఆయుష్షుతో జీవించేవారు. ఎలాంటి బాధ, అనారోగ్యాలు కలిగేవి కావు.

శ్రీ రాముడి రాజ్యంలో నిత్యం రామ నామమే అందరూ స్మరించేవారు. ప్రపంచం మొత్తం రాముడే కనిపించేవాడు. రాముడే సర్వస్వంగా నిలిచాడు.

శ్రీ రాముడి రాజ్యంలో అన్ని చెట్లు కలకలలాడేవి. రంగురంగుల పువ్వులు వికసించేవి. చీడల జాడ వల్ల పంటలు నష్టం అయ్యేవి కావు. 

శ్రీ రాముడి రాజ్యంలో విరివిగా వర్షాలు పడేవి. చక్కటి వెలుగు ఉండేది.

శ్రీ రాముడి రాజ్యంలో బ్రాహ్మణులు, క్షత్రీయులు, వైష్ణవులు, శుద్రులు తమ తమ కర్తవ్యాలను నిష్టగా పూర్తిచేసేవారు. పనిలో సంతోషాన్ని వెతుక్కునేవారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link