Indian Bank Recruitment 2024: నిరుద్యోగులకు ఇండియన్ బ్యాంక్ గుడ్ న్యూస్.. 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
Indian Bank Recruitment 2024: ఇండియన్ బ్యాంక్ ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 2వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ indianbank.in లో కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా మొత్తం 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ముందుగా అధికారిక నోటిఫికేషన్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి-40 పోస్టులు, తమిళనాడు, పుదుచ్చేరి కలిపి-160, కర్నాటక- 35, మహారాష్ట్ర-40, గుజరాత్ -15 పోస్టులను భర్తీ చేయనుంది.
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2024 అర్హత.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారు మార్కులు, శాతం కూడా వివరంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2024 జూలై 1 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ప్రభుత్వ అందించే ఏజ్ రిల్యాక్సేషన్ కూడా వీరికి వర్తిస్తుంది.
ఎంపిక విధానం.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ, రాత పరీక్ష లేదా ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా బ్యాంకు నిర్ణయం తీసుకుంటుంది. పరీక్ష, ఇంటర్వ్యూ పూర్తైన అభ్యర్థులకు ఇమెయిల్ లేదా బ్యాంక్ వెబ్‌సైట్‌లలో కాల్ లెట్టర్ అందుబాటులో ఉంచనున్నారు. ఈ నోటిఫకేషన్‌కు సంబంధించిన టెస్ట్ 200 మార్కులకు నిర్వహిస్తారు, ఇంటర్వ్యూకు మరో 100 మార్కులు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము.. ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఈడీ అభ్యర్థులు మాత్రం రూ.175 నామమాత్రపు ఫీజు చెల్లించాలి.