Indian railways: ఇండియన్ రైల్వేస్ ప్రారంభించబోతున్న భారత్ దర్శన్ యాత్ర విశేషాలివే..
భారత్ దర్శన్‌లో భాగంగా జనవరి 10 నుంచి 18 తేదీ వరకూ తొలి యాత్ర 4 జ్యోతిర్లింగాలకు సంబంధించి ఉంటుంది. ఇందులో మహాకాళేశ్వర్ ( Mahakaleshwar jyotirlinga ), ఆంకారేశ్వర్ ( Shri Omkareshwar jyotirlinga ), నాగేశ్వర్ ( Nageshvara jyotirlinga ), సోమ్‌నాధ్ ( Shree Somnath jyotirlinga temple ) దర్శనం జరుగుతుంది. ఈ యాత్ర సందర్బంగా ఇతర ప్రముఖ ప్రాంతాలైన గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం ( Sabarmati ashram), ప్రపంచపు అతి ఎత్తైన విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీ ( Statue of Unity )చూడవచ్చు. ఈ యాత్రకు ప్రతి ఒక్కరికి 8 వేల 505 రూపాయలవుతుంది.
రెండవ యాత్ర జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకూ ఉంటుంది. ఇందులో దక్షిణ భారతదేశం ( South India ) సందర్శన ఉంటుంది. ఈ యాత్రలో రామేశ్వరం ( Rameswaram ) కాంచీపురం ( Kanchipuram ) కన్యాకుమారి ( Kanyakumari ) చూడవచ్చు. ఈ యాత్రకు ప్రతి వ్యక్తికి 9 వేల 450 రూపాయలవుతుంది.
భారత్ దర్శన్ యాత్ర కోసం IRCTC అద్భుత ఏర్పాట్లు చేసింది. మీరు చెల్లించే డబ్బుల్లోనే...బ్రేక్ ఫాస్ట్ రెండు పూట్ల శాకాహార భోజనం, ఉండటానికి ఏర్పాట్లు ఉంటాయి. ఇవి కాకుండా టూర్ గైడ్ ( Tour Guide ) కోవిడ్ 19 ( Covid 19 ) రక్షణ కిట్ కూడా లభిస్తుంది. సెక్యూరిటీ కోసం ట్రైన్ లో గార్డులు ( Guards ) కూడా ఉంటారు.
భారత్ దర్శన్ రెండు యాత్రల కోసం టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. యాత్రకు వెళ్లే ఔత్సాహికులు ఆన్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదా కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ Kanpur Central Railway station లోని IRCTC Office నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు.