Indias Highest Railway Station: దేశంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే స్టేషన్ ఇదే
అత్యంత ఎత్తయిన రైల్వే స్టేషన్
దేశంలో అన్నింటికంటే ఎత్తైన రైల్వే స్టేషన్ పశ్చిమ బెంంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఉంది. ఈ స్టేషన్ పేరు ఘుమ్. ఈ స్టేషన్ డార్జిలింగ్ రైల్వే పరిధిలోనిది. సముద్రమట్టం నుంచి ఏకంగా 2258 మీటర్లు అంటే 7400 అడుగుల ఎత్తులో ఉంది.
రోజూ టాయ్ ట్రైన్
పర్యాటకులు ఈ స్టేషన్ చేరుకోవాలంటే డార్జిలింగ్ నుంచి ఓ టాయ్ ట్రైన్ ఘుమ్ స్టేషన్‌కు వెళ్తుంది. ఈ ట్రైన్ ద్వారా డార్జిలింగ్ అందాలు చూడవచ్చు.
తలను తాకేట్టుండే మేఘాలు
ఈ రైల్వే స్టేషన్ డార్జిలింగ్ నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందమైన ప్రాంతాల జాబితాలో 14వనంలో ఉంది. ఈ స్టేషన్ ఎంత ఎత్తులో ఉంటుందంటే మేఘాలు మీ తలకు ఆనుకుని వెళ్తున్నట్టు అన్పిస్తుంది
150 ఏళ్ల క్రితం బ్రిటీషు నిర్మించిన స్టేషన్
ఘుమ్ రైల్వే స్టేషన్‌ను దాదాపుగా 1500ఏళ్ల క్రితం బ్రిటీషువారు నిర్మించారు. 1878లో నిర్మాణం ప్రారంభమైంది. కోల్‌కతా నుంచి డార్జిలింగ్‌ను నేరుగా కలపడమే ఈ స్టేషన్ నిర్మాణం ఉద్దేశ్యం. 1879లో తొలి లైన్ డార్జిలింగ్ నుంచి ఘామౌర్ చేరింది.
ఘుమ్‌లో రైల్వే మ్యూజియం
ఘుమ్‌లో రైల్వే మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ 200 ఏళ్ల పాత చరిత్ర లభిస్తుంది. 1833లో ప్రింట్ అయిన టికెట్లు కూడా చూడవచ్చు.
టిబెట్‌లో ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్
ఇప్పటి వరకూ దేశంలో ఎత్తయిన రైల్వే స్టేషన్ గురించి తెలుసుకున్నాం. ఇక ప్రపంచంలో ఎత్తయిన రైల్వే స్టేషన్ చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్‌లో ఉంది. ఇక్కడ తాంగ్ గులా ప్రాంతంలో చైనా రైల్వే స్టేషన్ నిర్మించింది. ఇదే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే స్టేషన్