IPL 2021 Hundred Crores Club: ఐపీఎల్ 2021 వందకోట్ల క్లబ్‌లో టాప్ 5 ఆటగాళ్లు, వారి సంపాదన వివరాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఏబీ డివిలియర్స్ వందకోట్ల క్లబ్‌లో చేరిన తొలి విదేశీ ఆటగాడిగా ఉన్నాడు. ఇతడి వేతనం 11 కోట్ల రూపాయలు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఈ క్లబ్‌లో చేరిపోయాడు. ఈ సిరీస్‌లో ఇతడి సంపాదన 102.51 కోట్లుగా ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన సురేశ్ రైనా సీజన్ 2021 లో వందకోట్ల క్లబ్‌లో చేరిన నాలుగవ ఆటగాడిగా ఉన్నాడు. ఇతడి వేతనం 11 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకూ 99.7 కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ ఐపీఎల్ 2021లో వందకోట్ల క్లబ్‌లో చేరిపోయాడు.
రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ ఈ సిరీస్ తరువాత విరాట్ కోహ్లి కూడా ధోనీ, రోహిత్‌ల తరువాత 130 కోట్ల జాబితాలో చేరిపోయాడు. విరాట్ కోహ్లి ఇప్పటి వరకూ ఐపీఎల్ ద్వారా 126.6 కోట్లు సంపాదించాడు.
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2019లో ఐపీఎల్ గెల్చిన తరువాత ఐదుసార్లు టైటిల్ గెల్చుకున్నాడు. రోహిత్ శర్మ వందకోట్ల క్లబ్‌లో రెండవ స్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పటి వరకూ 131 కోట్లు సంపాదించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్న క్రీడాకారుడిగా ఉన్నాడు. ధోనీ గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 3 సార్లు ట్రోఫీ గెల్చుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ధోనీకు 15 కోట్ల రూపాయల వేతనం చెల్లిస్తోంది. ధోనీ ఇప్పటి వరకూ ఐపీఎల్ ద్వారా 137 కోట్ల రూపాయల కంటే ఎక్కువే సంపాదించి తొలి క్రీడాకారుడిగా నిలిచాడు.