IPL 2021: అత్యధికంగా ఆర్జించిన భారత క్రికెటర్లు వీరే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధికంగా ఆర్జించిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిలిచాడు. ఐపీఎల్ ద్వారా ధోనీ ఇప్పటివరకూ రూ.137.8 కోట్లు ఆర్జించాడు. ఇన్‌సైడ్ స్పోర్ట్ మనీబాల్ రిపోర్టు ప్రకారం వంద కోట్ల క్లబ్‌లో చేరనున్న నాలుగో భారత క్రికెటర్‌గా సురేష్ రైనా నిలవనున్నాడు. రైనా గత సీజన్‌లో ఆడలేదని తెలిసిందే. (Photo: BCCI) (Source: Insidesport Moneyball)
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టుకు 4 పర్యాయాలు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా ఆర్జించిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ. అతడు ఐపీఎల్ నుంచి ఇప్పటివరకూ రూ.131 కోట్లు సంపాదించాడు.
టీమిండయా రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ట్రోఫీ నెగ్గని కెప్టెన్‌గా అపవాదు ఎదుర్కొంటున్న స్టార్ క్రికెటర్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో రూ.126 కోట్లు ఆర్జించాడు.
ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు సురేష్ రైనా. భారత మాజీ క్రికెటర్ రైనా ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 99.7 కోట్ల రూపాయాలు సంపాదించాడు. ఈ సీజన్‌లో వంద కోట్ల మార్కును దాటబోతున్నాడు రైనా.
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కెప్టె్న్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు పర్యాయాలు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. ఐపీఎల్‌లో గంభీర్ రూ.94.6 కోట్లు ఆర్జించాడు. అయితే 2018లో రిటైర్మెంట్ ప్రకటించాడని తెలిసిందే.