Janhvi Kapoor: తిరుమలలో జాన్వీ కపూర్‌.. ఆమె ధరించిన పట్టుచీర ధర ఎంత?

Tue, 13 Aug 2024-5:53 pm,

Janhvi Kapoor: బాలీవుడ్‌ నుంచి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్‌ తరచూ తిరుమలను సందర్శిస్తున్నారు.

Janhvi Kapoor: ప్రతి సంవత్సరం ఆగస్టు 13 తన తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా తిరుమలను సందర్శిస్తోంది. తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీదేవి తిరుమలను దర్శించుకునేవారు. అదే సంప్రదాయాన్ని జాన్వీ పాటిస్తోంది.

Janhvi Kapoor: మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న జాన్వీ మంగళవారం శ్రీవారిని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.

Janhvi Kapoor: తిరుమలలో జాన్వీ ప్రత్యేకంగా ముస్తాబైంది. బంగారు రంగు పట్టుచీరలో.. టెంపుల్‌ జ్యువెలరీలో జాన్వీ మెరిసింది.

Janhvi Kapoor: చీరలో దిగిన ఫొటోను జాన్వీ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. శేషాచలం కొండల అందాన్ని చూస్తూ పరవశిస్తూ జాన్వీ ఫొటోకు ఫోజులిచ్చింది.

Janhvi Kapoor: అయితే జాన్వీ ధరించిన చీర కంచి పట్టు రకం అని సమాచారం. ఆ చీర దాదాపు లక్ష రూపాయలకు పైగా ధర ఉంటుందని ఫ్యాషన్‌ ప్రముఖులు చెబుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link