Jr NTR Recent Movies Pre Release Business Details: ‘దేవర’ సహా ఎన్టీఆర్ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

Tue, 24 Sep 2024-12:45 pm,

తాజాగా ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. ఈ నేపథ్యంలో తారక్ నటించిన రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్ విషయానికొస్తే..

దేవర పార్ట్ -1.. తారక్ కథానాయకుడిగా  హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘దేవర పార్ట్ -1’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.  ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  

 

RRR.. రౌద్రం రణం రుధిరం.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గణ్ కథానాయకులుగా  రాజమౌళి డైరెక్షన్ లో  తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రూ.191 కోట్ల బిజినెస్ చేసింది. ఈ చిత్రం వాల్డ్ వైల్డ్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

అరవింద సమేత వీరరాఘవ... ఎన్టీఆర్, పూజా హెగ్డే టైటిల్ రోల్స్ లో నటిచిన సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

జై లవకుశ.. ఎన్టీఆర్ తొలి సారి త్రిపాత్రాభినయం చేసిన మూవీ ‘జైలవకుశ’. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించిన  ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 86 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

జనతా గ్యారేజ్.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 66 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link