Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..
ఫెమస్ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప కు,విజయ లక్ష్మీకి దాదాపు 20 ఏళ్ల క్రితమే పెళ్లి అయ్యింది. వీరికి కొడుకు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో దర్శన్ కు, పవిత్ర గౌడతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
హత్య గావించబడిన రేణుక స్వామి, దర్శన్ కు ఫాన్ అంట. పవిత్ర గౌడ వల్ల.. విజయ లక్ష్మీకి అన్యాయం జరుగుతుందని, పవిత్ర ఇన్ స్టాలో అసభ్య కరమెస్సెజ్ లు, అశ్లీల పోస్టులు చేశాడు. ఈ క్రమంలోనే, పవిత్ర గౌడ, తన ప్రియుడికి ఈ విషయం చెప్పింది.
ఘటనకు ముందు పలు మార్లు రేణుక స్వామిని హెచ్చరించిన కూడా మారకపోవడంతో ఈ విధంగా క్రూరంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇక పవిత్ర గౌడవిషయానికి వస్తే.. ఛత్రిగాలుసార్ ఛత్రిగాలు, అగమ్య, ప్రీతా కితాబు, వంటి మూవీలో నటించింది.
మా బంధానికి పదేళ్లంటూ... దర్శన్ తో ఆమె తీసిని సినిమాలను పంచుకుంది. అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. తన అభిమాన హీరో చేతిలోనే రేణుకస్వామి చంపబడ్డాడు. బెంగళూరులో ఫామ్ హౌస్ లో బంధించి చిత్రహింసలు పెట్టి మరీ చంపినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ మేరకు పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శన్ ను, పవిత్ర గౌడను కోర్టులో హజరు పర్చినప్పుడు వందలాదిగా దర్శన్ అభిమానులు కోర్టుకు చేరుకున్నారు. మరోవైపు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని హోంమంత్రి డా.జీ. పరమేశ్వర్ ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీచేశారు.
తన భార్యను వదిలిపెట్టి, మరోకరి కోసం తమ నటుడు ఇలా హత్య కేసులో ఇరుక్కొవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై కన్నడ మూవీ ఇండస్ట్రీ కూడా దర్శన్ ను అసోసియేషన్ నుంచి సభ్యత్వం రద్దుపై మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.