Rishab Shetty: గతంలో డ్రింకింగ్ వాటర్ అమ్మిన వ్యక్తి.. నేడు జాతీయ ఉత్తమ నటుడు.. రిషభ్ శెట్టి ప్రస్థానం ఎలా సాగిందంటే..?
కాంతారా హీరో రిషభ్ శెట్టి మరోసారి వార్తలలో నిలిచారు. కాంతారా మూవీ ఎంత సక్సెస్ సాధించిందో.. బాక్సాఫిస్ ల మీద రికార్డుల సునామీ ఎలా క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి కూడా కాంతారాకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రిషభ్ కాంతారా 2 లో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా... కాంతారా హీరో మరోసారి సంచలనంగా మారారు. ఆయన ఏకంగా జాతీయ చలన చిత్ర అవార్డులలో బెస్ట్ హీరో అవార్డుకు ఎంపికయ్యారు. కాంతారా సినిమాలో ఆయన నటనకు కేంద్రం ఈ అవార్డుతో రిషభ్ ను సత్కరించింది. రిషభ్ ది కర్ణాటకలోని కెరాడి అనే గ్రామం.
రిషభ్ తండ్రి, భాస్కర్ శెట్టిజ్యోతిష్యుడు, తల్లి రత్నవతి. ఇతని ఒక అక్క, అన్న ఉన్నారు. ఇంట్లో రిషభ్ అందరికన్న చిన్నవాడు. రిషభ్ చిన్నప్పుుడు అల్లరి చేసేవాడు. సినిమాలు ఎక్కువగా చూసేవాడంట. చదువును ఏమాత్రం లెక్కచేసేవాడు కాదంట.
చిన్నప్పుడు రిషభ్ కు.. బేకరీలో తిన్న పదార్థంకు.. రూ. 18 అవ్వగా.. ఆయన దగ్గర కేవలం రూ. 17 మాత్రమే ఉన్నాయంట. ఒక రూపాయి తన జేబులో లేకపోవడంతో ఎంతో కుమిలిపోయారంట. అప్పటి నుంచి ఆయన తన లైఫ్ ను చెంజ్ చేసుకున్నారంట.
రిషభ్ చిన్నప్పుడే పౌరాణిక పాత్రాలపై ఆసక్తి చూపించేవాడంట. ఆయన బెంగళూరుకు వెళ్లి.. రంగసౌరభం అనే డ్యాన్స్ గ్రూప్ లో చేరి నాటకాలు వేసేవాడంట. డిగ్రీ కాకముందే.. సినిమాల మీదున్న ఇష్టం కారణంగా..డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరాడంట.
ఎవరి మీద ఆధారపడటం ఇష్టంలేని రిషభ్ షెట్టి రాత్రిళ్లు.. మినరల్ వాటర్ ను సైతం అమ్మేవాడంట. రాత్రంతా వాటర్ సప్లై చేసి వ్యానుల్లోనే నిద్రపోయేవాడంట. ఉదయం మరల అక్క ఇంటికి చేరుకునేవాడంట.
రిషభ్ వాటర్ సరఫరా చేసే కన్నడ నిర్మాత.. ఎం.డీ ప్రకాశ్.. సైనైడ్ మూవీకి అసిస్టెంట్ దర్శకుడిగా చాన్స్ ఇప్పించాడంట. అక్కడ ఎటిటర్, లైట్ బాయ్, టచప్ మెన్. వంటి అనేక విషయాల గురించి నేర్చుకున్నాడంట.
ఒకసారి దర్శకుడు తలపై కొట్టడంతో.. చెప్పాపెట్టకుండదా.. చిత్రం నుంచి వచ్చేశాడంట. అదే విధంగా.. 2009 లో హోటల్ స్టార్ట్ చేశాడు.అదికలిసిరాక.. మరల సినిమావైపు వచ్చేశాడంట. ఆ తర్వాత కిరిక్ పార్టీ, సర్కారీ హిరియా ప్రాథమిక శాలే, కాసరగోడు, హిట్ ను ఇచ్చాయి. బెల్ బాటమ్ తో.. రిషభ్ కోరిక నెరవేరింది. ఆ తర్వాత లైఫ్ ఒక్కసారిగా మారిపోయిందంట..