Car Insurance: ఈ వర్షాకాలం కారు డ్యామేజ్ అవుతుందని భయమా? అయితే ఏ బీమా పాలసీ ఎంచుకుంటే లాభమో తెలుసుకోండి.!!

Tue, 30 Jul 2024-11:59 pm,

Car Damage Insurance Policy: వర్షాకాలం వచ్చిందంటే చాలు పలు ప్రాంతాల్లో వరదలు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో నగరాల్లో కూడా మారిన పరిస్థితుల కారణంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి నీరు వచ్చి చేరుతోంది. ఈ నీరు ఇళ్లల్లో కూడా వచ్చి చేరుతోంది. ముఖ్యంగా అపార్ట్మెంట్ సెల్లార్లలో కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కార్లు పెద్ద ఎత్తున డ్యామేజీ అవుతున్నాయి. ఈ కార్ల డ్యామేజీని తట్టుకునేందుకు మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి వరద నష్టం వచ్చినప్పుడు ఎలాంటి బీమా పాలసీని తీసుకున్నట్లయితే, మీకు లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తద్వారా మీరు వరద నష్టం సంభవించినప్పుడు బీమా ను క్లీన్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే మీ నష్టాన్ని కూడా భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది.  

సాధారణంగా వర్షాకాలంలో కార్లు బైకులు డ్యామేజీ అవడం అనేది సర్వసాధారణం. మెకానిక్ వద్దకు కూడా వర్షాకాలంలోనే పెద్ద ఎత్తున వాహనాల రిపేర్లు జరుగుతూ ఉంటాయి. అయితే వరదలు వచ్చినప్పుడు మాత్రం పెద్ద ఎత్తున కార్లు డ్యామేజీ అవుతాయి. వీటిలో ప్రధానంగా ఇంజన్ డ్యామేజీ, గేర్ బాక్స్ డ్యామేజీ, ఎలక్ట్రానిక్ డ్యామేజీ, ఇంటీరియర్ డ్యామేజీ అనేవి ప్రధానంగా ఉంటాయి. అయితే మీరు ఎంపిక చేసుకున్న కార్ పాలసీలో ఏఏ డ్యామేజీ లకు కవరేజీ ఉందో తెలుసుకోవడం అనేది ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు.   

ఒకవేళ మీరు కారు పాలసీ ఎంచుకున్నట్లయితే, అందులో సమగ్ర కారు బీమా కవరేజీని ఎంపిక చేసుకోవాలి. ఇందులో భూకంపాలు, వరదలు, సహా ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కారు డ్యామేజీ అయితే అందుకు కవరేజీ మీకు లభించాల్సి ఉంటుంది. అన్న సంగతి మీరు గమనించాలి. తద్వారా మీరు నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు.   

ఎలాంటి కార్ పాలసీ తీసుకోవాలి:మీరు వరదలకు గురయ్యే ప్రాంతంలో నివసిస్తుంటే, మీకు తగిన కారు బీమా కవరేజీ ఉండాలి.  

ఇంజిన్ రక్షణ కవరేజ్: వరద నీరు చేరడం వల్ల కారు ఇంజిన్ పాడైపోతుంది. అందుకే ఇంజిన్ రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్ కోసం ఆర్థిక కవరేజీని అందించే పాలసీ ఎంచుకోవాలి.  

జీరో డిప్రిసియేషన్ కవరేజ్: కారు భాగాలు సహజంగా అరిగిపోవడం వల్ల కాలక్రమేణా అరిగిపోతాయి, వాహనం విలువకు నష్టాన్ని కలిగిస్తుంది, దీనిని డిప్రిషియేషన్ అంటారు. క్లెయిమ్ చేసే సమయంలో, దెబ్బతిన్న భాగాల డిప్రిషియేషన్ విలువను కవర్ చేసే బీమా పాలసీని ఎంచుకోవాలి. 

కీ రీప్లేస్‌మెంట్ కవర్: కారు కీలను రిపేర్ చేయడం సంక్లిష్టమైనది అలాగే చాలా ఖరీదైనది. వరదల కారణంగా మీ కారు కీ లేదా లాక్‌సెట్ దెబ్బతిన్నట్లయితే, ఈ కవరేజ్ లాక్‌సెట్‌ను భర్తీ చేయడానికి లేదా రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చును కవర్ చేసే బీమా పాలసీ ఎంచుకోవాలి.   

వినియోగ వస్తువుల కవర్: లూబ్రికెంట్లు, గేర్‌బాక్స్ మరియు ఇంజిన్ ఆయిల్‌లు, నట్స్ మరియు బోల్ట్‌లు, గ్రీజులు మొదలైన వినియోగ వస్తువులను భర్తీ చేయడానికి అయ్యే ఖర్చును కొన్ని రకాల ప్లాన్లు కవర్ చేయవు. వీటిని కవర్ చేసే పాలసీని ఎంచుకోవాలి.   

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవరేజ్: వరదల కారణంగా మీ కారు చిక్కుకుపోయినట్లయితే, మీరు టోయింగ్‌తో సహా 24x7 అత్యవసర రోడ్‌సైడ్ సహాయం పొందే బీమా కవరేజీ ఉండే పాలసీ ఎంచుకోవాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link