Kia Ev3 Price: ప్రీమియం ఫీచర్స్‌తో కియా EV3 వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్!

Tue, 07 May 2024-6:22 pm,

దక్షిణ కొరియా ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ కియా మే 23న తన కొత్త ఎలక్ట్రిక్ కారు EV3ని మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. లాంచింగ్‌కి ముందే కారుకు సంబంధించిన  టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది.

  కియా EV3 కారుకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం, కియా ఈవీ3కి బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపించబోతోంది.

ఈ కియా EV3 కారు స్టైలిష్ సిగ్నేచర్ LED లైటింగ్, బ్లాక్ క్లాడింగ్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ కారు చూడడానికి అచ్చం స్టోర్ట్‌ లుక్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ కారును కియా అధునాతన ఫీచర్లతో పాటు ఆధునిక సాంకేతికతతో మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది.  ఇక ఈ కారు ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే ఇది స్టైలిష్ స్టీరింగ్ వీల్‌తో రాబోతోంది. దీంతో పాటు ప్రీమియం అప్హోల్స్టరీని కలిగి ఉంటుంది.

ఇక Kia EV3 ధర వివరాల్లోకి వెళితే, మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే, ధర రూ. 29.2 లక్షలతో అందుబాటులోకి రాబోతోంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా లాంచ్‌ చేసే ఛాన్స్‌ ఉంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link