Kiran Abbavaram: కేరళలో యంగ్ హీరో పెళ్లి..పూర్తి వివరాలు ఇవే..!
కిరణ్ అబ్బవరం.. రహస్య ఘోరక్ తో వివాహానికి సిద్ధమయ్యారు. 2019లో వచ్చిన రాజా వారు రాణి గారు సినిమాలో వీరిద్దరూ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
కిరణ్ అబ్బవరం, రహస్య కుటుంబ సభ్యుల మధ్య 2024 మార్చి 13వ తేదీన నిశ్చితార్థం జరుపుకున్నారు.హైదరాబాదులోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.
కాగా వీరిద్దరూ ఆగస్టు 2024లో వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆగస్టు 22వ తేదీన కేరళలో వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నారు.
ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టుగా వీరి కాపురం కలకాలం సవ్యంగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా పీస్ఫుల్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కేరళలో వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలందరూ హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఈ హీరో క అనే..సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమా పై మరింత ఆసక్తి నెలకొల్పింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో.. దర్శకద్వయం సందీప్, సుజీత్..ఈ మూవీని తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమాతో.. వీరిద్దరు డైరెక్టర్లుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్నారు.