Interesting Facts About Moles: మచ్చలపై ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Fri, 11 Dec 2020-7:51 pm,

పెదవిపై మచ్చ ఉంటే చాలా అందంగా కనిపిస్తారు. అయితే ఆడ లేదా మగవారి పెదవుల కుడివైపున మచ్చ ఉంటే వారు తమ జీవిత భాగస్వామితో రొమాంటిక్‌గా ఉంటారు. జీవిత భాగస్వామితో బెడ్‌రూమ్‌లో ఆనందంగా గడుపుతారు. మరోవైపు, పెదవి కింది వైపు మచ్చ ఉన్నవారు తినడానికి చాలా ఇష్టపడతారు.

అరచేతిలో ఉన్నా, బొటనవేలుకు పక్కనగానీ మచ్చ ఉన్నట్లయితే, మీరు మీ జీవితంలో గొప్ప విజయాన్ని అందుకుంటారు. కానీ, బొటనవేలు మీద మచ్చ ఉంటే మాత్రం వాళ్లు ఎంత శ్రమించినా విజయం సాధించరని విశ్వసిస్తారు.

నుదుట, అందులోనూ ఎడమ వైపున మచ్చ ఉన్నవారు చాలా డబ్బు సంపాదిస్తారు. నుదుటి మధ్యలో మచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. వీరు ఏ రంగంలో ఉన్నా.. భాగస్వామి సహకారంతో జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటాడు.

యెద (ఛాతీపై) ఎడమ వైపున మచ్చ ఉన్నవారిలో చాలా మందికి వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి రొమాంటిక్‌గా ఉంటారు. ఈ వ్యక్తులు గుండె జబ్బులు బారిన పడే ప్రమాదం ఉంది. ఛాతీకి కుడి వైపున మచ్చ ఉన్నవారు అదృష్టవంతులు అని చెబుతారు.

Also Read : Madhumita Sarkar Photos: నాభి సోయగాలతో సెగలు రేపుతోన్న నటి

ఉదరం (Stomach)పై మచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఎడమ వైపున మచ్చ ఉంటే అలాంటివారు ఉదర సంబంధ సమస్యల బారిన పడే అవకాశం ఉంది. నాభి (బొడ్డు) కింద మచ్చ ఉన్నవారికి లైంగిక సమస్యలు, సంబంధిత వ్యాధితో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.

Also Read : ​Mukesh Ambani becomes Grandfather: తాత అయిన ముఖేష్ అంబానీ.. సంబరాలలో ఫ్యామిలీ

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link