Krithi Shetty: మకాం మార్చిన కృతి శెట్టి.. నెక్స్ట్ ప్లాన్ అదే!

Fri, 12 Jul 2024-10:42 pm,

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. వైష్ణవ తేజ్ హీరోగా వచ్చిన ఈ చిత్రానికి.. బుచ్చి బాబు సాన దర్శకత్వం వహించారు. మొదటి చిత్రంతోనే విజయం అందుకోవడం.. ఎవరికైనా నిజంగానే అదృష్టం. అలాంటిది మన హీరోయిన్ మొదటి సినిమాతోనే 100 కోట్ల సినిమా అందుకుంది.   

ఆ తరువాత వెంటనే.. నానితో శ్యామ్ సింగరాయ.. సినిమాలో కనిపించి మెప్పించింది. ఆ చిత్రం కూడా హిట్ అవ్వడంతో.. ఈ హీరోయిన్ కి వరస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక నాగచైతన్య తో వచ్చిన బంగార్రాజు చిత్రం కూడా విజయం సాధించింది. 

మొత్తానికి వరసగా మూడు విజయాలు సాధించి.. తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారింది ఈ హీరోయిన్. కానీ అసలు కథ.. ఆ మూడు సినిమాల తరువాత మొదలయ్యింది. అప్పటి నుంచి కృతికి వలస అపజయాలు రావడం మొదలయ్యాయి. 

దానికి తోడు.. అసలు తన పాత్రకి విలువ లేని సినిమాలు చెయ్యడం.. ఈ హీరోయిన్ కి మరింత మైనస్ అయింది. ఈ క్రమంలో ప్రస్తుతం కృతి మకాం మార్చినట్టు తెలుస్తోంది. ఈమధ్య వచ్చిన శర్వానంద్ మనమే కూడా ఫ్లాప్ అవ్వడంతో.. కృతికి తెలుగులో అవకాశాలు అస్సలు రావడం లేదు. అందుకే మన హీరోయిన్ కాస్త తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. 

ప్రస్తుతం కృతికి అక్కడ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలలో.. ఒక్కటి హిట్ అయిన.. కృతికి అక్కడ మళ్లీ వరుస అవకాశాలు రావడం ఖాయం. మరి అక్కడ అవకాశాలన్న ఉపయోగించుకొని.. స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందేమో వేచి చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link