Krithi Shetty: అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ కృతి శెట్టి.. గురుద్వారాలో బేబమ్మ ప్రత్యేక ప్రార్ధనలు..

Sun, 28 Jul 2024-11:45 am,

కృతి శెట్టి  ఫస్ట్ మూడు సినిమాల సక్సెస్‌తో హాట్రిక్ భామగా పేరు గడించింది. ఆ తర్వాత వరుస  ఫ్లాపులు ఈ అమ్మడి క్రేజ్ కు స్పీడు బ్రేకులు పడ్డాయి. రీసెంట్ గా ‘మనమే’ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.

కృతి శెట్టి.. తాజాగా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించింది. అంతేకాదు అక్కడ ప్రత్యేక ప్రార్ధనలు చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను తనకు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

కృతి శెట్టి.. ‘ఉప్పెన’'శ్యామ్ సింగరాయ్', ‘బంగార్రాజు’ వంటి  వరుస సక్సెస్ లతో  హాట్రిక్ హిట్స్ అందుకొని టాలీవుడ్ లో  హాట్ బేబ్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది.

కృతి శెట్టి కెరీర్ లో హాట్రిక్ హిట్స్ తో పాటు హాట్రిక్ ఫ్లాపులున్నాయి. వరుసగా వచ్చిన చిత్రాలు వచ్చినట్టు ఫ్లాప్ కావడంతో ఆమె కెరీర్‌ డౌన్ ఫాల్ అయింది.

మెగా మేనల్లుడు  వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఉప్పెన'మూవీతో  హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయింది కృతి శెట్టి. అంతకు ముందు హృతిక్ రోషన్ 'సూపర్ 30'లో ఓ స్టూడెంట్ పాత్రలో మెరిసింది బేబమ్మ. 

కెరీర్ మొదట్లోనే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి హిట్స్‌తో హాట్రిక్ భామ అనిపించుకుంది.

ఆ తర్వాత వరుసగా 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', కస్టడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అమ్మడి కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

రీసెంట్ గా శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ సినిమాతో పర్వాలేదనిపించింది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు తమిళం, 1 మలయాళం, తెలుగు సినిమాలున్నాయి. ఈ సినిమాల ఫలితాలపైనే కృతి శెట్టి కెరీర్ ఆధారపడి ఉంది. త్వరలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link