Small Business 2024: అమెజింగ్ బిజినెస్ ఐడియా భయ్యా..కేవలం రూ.20 పెట్టుబడి పెడితే చాలు.. రూ. 5 లక్షలు సంపాదించవచ్చు
ఆరోగ్యం, ఆహారం అనేది ప్రజల జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. కాబట్టి ఈ రంగాలలోని వ్యాపారాలు సాధారణంగా స్థిరంగా ఉంటాయి. మీరు కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తే ఈ ఆరోగ్యకరమైన ఫూడ్ బిజినెస్ ప్లాన్ చేయవచ్చు. అదే లెమన్ గ్రాస్ బిజినెస్ ఐడియా.
లెమన్ గ్రాస్ లేదా నిమ్మగడ్డి అని కూడా పిలుస్తారు. ఇది ఆరోగ్యకరమైన మొక్క. దీని ఎంతో సులభంగా సాగు చేయవచ్చు. ఆరోగ్యనిపుణుల ప్రకారం లెమన్ గ్రాస్ దీర్ఘకాలిక వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
లెమన్ గ్రాస్‌తో మీరు వివిధ రకాల బిజినెస్‌లను ప్రారంభించవచ్చు. ఈ మొక్కతో టీ, నూనె, జ్యూస్ వంటి ఉత్పత్తులను మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. ఈ లెమన్ గ్రాస్ బిజినెస్ ఒక ATM లాగా పని చేస్తుంది.
ఈ బిజినెస్ ప్రారంభించడం కోసం మీరు కేవలం రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీంతో మీరు రూ. లక్షలు సంపాదించవచ్చు. నిమ్మగడ్డిని ఒకసారి సాగు చేస్తే 6 నుంచి 7 సార్లు ఉపయోగించవచ్చు.
సంవత్సరానికి 4 సార్లు ఈ లెమన్ గ్రాస్‌ను కత్తిరించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో మీరు నిమ్మగడ్డి నూనె తయారు చేసుకోవచ్చు. ఇది మూడు నుంచి ఐదు మి.లీ నూనెను తీయవచ్చు.
మార్కెట్‌లో లెమన్ గ్రాస్ నూనెకు రూ.1000 నుంచి రూ.1500 వరకు డిమాండ్ ఉంది. మీరు కేవలం చిన్న లెమన్‌గ్రాస్ నర్సరీ బెడ్ కొనుగోలు చేసి ఇంట్లోనే సాగు చేసుకోవచ్చు. ఈ గ్రాస్‌ను ఎక్కువగా మార్చి నుంచి ఏప్రిల్ లో కొనుగోలు చేయడం ఉత్తమం.
లెమన్ గ్రాస్ సాగుతో మీరు ప్రతి సంవత్సరం రూ. 5 లక్షలు సంపాదించవచ్చు. అలస్యం చేయకుండా మీరు కూడా ఈ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించండి.