Lava Blaze X 5G: 64MP సోనీ కెమెరా Lava Blaze X 5G మొబైల్‌ను రూ.799కే మీ సొంతం..

Sat, 03 Aug 2024-4:02 pm,

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనపు డిస్కౌంట్ పొందడానికి ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఈ Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ను లావా కంపెనీ మార్కెట్‌లో మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు రెండు విభిన్న కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్నాయి.   

ఈ మొబైల్‌ మొదటి వేరియంట్‌ 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 6GB ర్యామ్‌, 128GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. చివరి వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ అందిస్తోంది. 

ప్రస్తుతం మార్కెట్‌లో ఇది MRP ధర రూ.16,999తో లభిస్తోంది. అయితే దీనిని ఇప్పుడే అమెజాన్‌ లిమిటెడ్‌ టైమ్‌ డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 12 శాతం తగ్గింపు పొందవచ్చు.   

దీంతో ఈ మొబైల్‌ ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్ పోను కేవలం రూ.14,999కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా అమెజాన్‌ నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.  

అలాగే ఈ Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. పాత మొబైల్‌ ఎక్చేంజ్‌ చేసే కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.14,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.799కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై అదనపు డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కూడా భారీ తగ్గింపుతో పొందవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link