Lok Sabha 2024 Elections: 2024 లోక్‌ సభకు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తోన్న సినిమా హీరోయిన్లు వీళ్లే..

Fri, 12 Apr 2024-12:20 pm,

రాధిక శరత్ కుమార్.. (Radhika Sarathkumar)

రాధిక శరత్ కుమార్ బీజేపీ తరుపున తమిళనాడులోని విరుధ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. ఈ నెల 19న మొదటి విడతలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.

కంగనా రనౌత్ (Kangana Ranaut)

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తన సొంత రాష్ట్రంలోని సొంత ప్రదేశమైన మండీ లోక్ సభ స్థానం నుంచి పోటీకి దిగుతోంది. ఇక్కడ జూన్ 1న చివరి విడతలో ఎన్నికలు జరగన్నాయి.

హేమా మాలిని (Hema Malini) ఒకప్పటి యూత్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని ముచ్చటగా మూడోసారి ఉత్తర ప్రదేశ్‌లోని మథుర నుంచి బీజేపీ తరుపున ఎంపీగా బరిలో దిగుతున్నారు.

స్మృతి ఇరానీ (Smriti Irani) కేంద్ర మంత్రి స్మృతి గత ఎన్నికల మాదిరే మరోసారి యూపీలోని అమేఠీ నుంచి మూడోసారి ఎంపీగా పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో ఈమె రాహుల్ గాంధీని ఓడించి సంచలనం రేపారు. తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు.

లాకెట్ ఛటర్జీ.. (Locket Chatterjee) అనేక బెంగాలీ సినిమాల్లో నటించిన ప్రముఖ డాన్సర్‌గా పేరు పొందిన లాకెట్ ఛటర్జీ.. మరోసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్దిగా పశ్చిమ బంగలోని హుగ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఈమె ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు.

నవనీత్ కౌర్ రాణా.. (Navneet Kaur Rana) నవనీత్ కౌర్ రాణా గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా ఎంపీగా గెలిచి సంచలనం రేపారు. ఈసారి బీజేపీలో చేరి ఆ పార్టీ తరుపున అమరావతి ఎంపీగా పోటీ చేస్తుండటం విశేషం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link