Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజు పరమ శివుడికి ఏమేం సమర్పించాలి, వేటితో అభిషేకం చేయాలో తెలుసా

Thu, 11 Mar 2021-3:28 pm,

Maha Shivratri 2021 |  శివుడు, జగన్మాత పార్వతి వివాహం జరిగిన రోజు. మహా శివరాత్రి పండుగను 'శివరాత్రి' అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది మార్చి 11న మహాశివరాత్రి పండుగ(Maha Shivaratri 2021)ను వేడుకగా జరుపుకోనున్నాం. (Twitter Photo)

Also Read: Maha Shivratri 2021 Date And Time: మహా శివరాత్రి తేదీ, పూజకు శుభ ముహూర్తం, తిథి, ప్రాముఖ్యత

బిల్వ పత్రం శివుడికి చాలా ప్రియమైనది. ఆరోజు పరమశివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. వ్యాధులను దూరం చేస్తుందని సైతం భక్తులు విశ్విసిస్తారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం.

శివ పురాణం ప్రకారం, శివలింగం శివుని వ్యక్తిత్వం లేని రూపంగా పరిగణిస్తారు. కనుక మహా శివరాత్రి(Happy Shivaratri 2021) సందర్భంగా మాత్రమే కాకుండా, ప్రతిరోజు శివలింగాన్ని నీటితో అభిషేకం చేయవచ్చు. తద్వారా మిమ్మల్ని అదృష్టం వరించనుంది. శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా శారీరక మరియు మానసిక సమస్యలు దూరం అవుతాయి.  అంతేకాక, శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పెద్దలు చెబుతారు. 

Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు

భగవంతుడికి ఎంతో ఆనందాన్నిచ్చే మరో విషయం బియ్యం. మహాశివరాత్రి నాడు శివుడికి భక్తితో బియ్యం సమర్పించాలి. శివ పురాణాల ప్రకారం, శివుడికి అన్నపూర్ణ స్వరూపమైన బియ్యం సమర్పించడం ద్వారా శివుడు సంతోషించి మీకు అన్ని శుభాలు కలుగజేస్తాడని నమ్మకం. సంపదను, ఆరోగ్యాన్ని సైతం అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

మహాదేవుడు శివుడి లింగాకారాన్ని ఈ కింది వాటితో అభిషేకించడం ఉత్తమమని పెద్దలు చెబుతారు. పెరుగు పాలు లేదా నీళ్లు తేనే కొబ్బరి నీళ్లు విభూతి అరటిపండ్లు ఎర్రచందనం పేస్ట్ పాలు, చక్కెర, నెయ్యి, తేనే, పెరుగుల మిశ్రమం అయిన పంచామృతం (Panchamruta)తోనూ అభిషేకం చేయడం ద్వారా మీకు పరమశివుడు శుభాలు చేకూరుస్తాడు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link