Meet Nikita Porwal: ఫెమినా మిస్ ఇండియా నికితా పోర్వాల్ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే.!
అక్టోబర్ 16 నిన్న రాత్రి వరకు జరిగిన ఫెమినా మిస్ ఇండియా టైటిల్ పోరులో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి చెందిన నికితా పోర్వాల్ కైవసం చేసుకుంది. టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నికితా మోడలింగ్ రంగంపై ఆసక్తి ఎక్కువ.
నికితా పోర్వాల్ తండ్రి అశోక్ పోర్వాల్. అతను కూడా డ్రామాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈమెకు పెయింటింగ్, సినిమాలు, రాయడం అంటే ఇష్టం. నికితా 250 పేజీల కృష్ణ లీల నాటకం కూడా రాసింది.
అంతేకాదు ఈ అందమైన అమ్మాయి జంతు ప్రేమికురాలు కూడా. ఈమె కార్నెల్ కాన్వెంట్ లో సెకండరీ స్కూల్ అభ్యసించారు. బరోడాలోని మహారాజా సాయాజీరావు యూనివర్శిటీ నుంచి పట్టా పొందారు. నికితా అందం తెలివితేటలు కలగలసిన అమ్మాయి. అంతేకాదండోయ్ నికితా 60 కి పైగా నాటకాల్లో కూడా యాక్ట్ చేసింది.
ఆమె ఓ చిత్రంలో కూడా నటించారు. ఇటీవలె ఆమె సోషల్ మీడియా పేజీలో ట్రైలర్ కూడా పోస్ట్ చేశారు. ఈ చిత్రం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు. త్వరలో భారత్‌లో కూడా విడుదల కానుంది.
ఇదిలా ఉండగా నికితా ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పింది. అందులో తనకు ఇష్టమైన నటి గురించి అడిగితే ఐశ్వర్యరాయ్ బచ్చన్ అని చెప్పింది. తనకు సంజయ్ లీలా బన్సాలీ చిత్రంలో నటించాలనే ఆశ ఉందని చెప్పింది.
సోషల్ మీడియాలో కూడా నికితా పోర్వాల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఆమెకు ఇప్పటికే 6 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక పోటీల్లో గెలిచిన నికితాకు నందిని గుప్తా కిరీటాన్ని బహుకరించగా.. నటి నేహా దూఫియా పూల బొకేను అందజేశారు.
నికితా మన దేశంలోని ఎందరో అమ్మాయిలకు స్పూర్తిదాయకం. ఆమె ఆ తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు కూడా భారత్ తరఫున ప్రాతినిద్యం వహించనుంది.