Mrunal Thakur: క్యూట్ ఫోజులతో అలరిస్తున్న మృణాల్ ఠాకూర్
హిందీలో చిన్న సీరియల్స్ లో తన కెరియర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్.. ఆ తరువాత కొన్ని హిందీ సినిమాలలో సైతం కనిపించింది
అయితే ఆమెకు బాలీవుడ్ లో అంతగా గుర్తింపు రాలేదు.. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన సీతారామం..చిత్రంతో సౌత్ ప్రేక్షకులకు పరిచయమైంది ఈ హీరోయిన్
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీతారామం సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
ఇక ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమా కూడా ఆమెకు పెద్ద విజయం అందించింది. మృణాల్ ఠాకూర్ పాత్రల సెలక్షన్ అదరహో అంటూ అందరూ ప్రశంసలు కూడా కురిపించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఏప్రిల్ 5వ విడుదలవుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజాగా మృణాల్ ఠాకూర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్ దుస్టులలో.. క్యూట్ ఫోజులు ఇస్తూ ..అందరిని ఆకట్టుకుంటుంది ఈ హీరోయిన్.