Mrunal Thakur: బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన మృణాల్..పోస్ట్ వైరల్.. మీరు అతన్ని చూసేయండి!

Sat, 21 Sep 2024-5:40 pm,

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ తొలి చిత్రంతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. ఇందులో సీత క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. పట్టు పరికిణిలో సాంప్రదాయంగా కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా తీసుకొచ్చిన ఇమేజ్ తో..  ఈమెకు వరుస సినిమాలలో అవకాశాలు లభిస్తున్నాయని చెప్పవచ్చు.

ఈ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రంలో అవకాశాన్ని అందుకున్న మృణాల్ ఠాకూర్ తన అద్భుతమైన నటన కనబరిచి,  ఏకంగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 

ప్రస్తుతం వరుస డిజాస్టర్లు చవిచూస్తున్న నేపథ్యంలో కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే ఇండస్ట్రీకి దూరమైనా.. అభిమానులకు చేరువగా ఉండడానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామర్ కు సంబంధించిన ప్రతి ఫోటోని అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక వ్యక్తి ఫోటోని పంచుకుంటూ ఈ విధంగా షేర్ చేసింది. 

హ్యాపీ బర్తడే బెస్ట్ హ్యూమన్.. రేపు చెన్నైలో మనం కలవబోతున్నాం. నీ బర్తడే చేయడానికి నేను ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాను అంటూ ఒక వ్యక్తితో చాలా చనువుగా ఉన్న ఫోటోని షేర్ చేసింది మృణాల్ ఠాకూర్. 

హ్యాపీ బర్తడే బెస్ట్ హ్యూమన్.. రేపు చెన్నైలో మనం కలవబోతున్నాం. నీ బర్తడే చేయడానికి నేను ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాను అంటూ ఒక వ్యక్తితో చాలా చనువుగా ఉన్న ఫోటోని షేర్ చేసింది మృణాల్ ఠాకూర్. 

మృణాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తాను  సెలెక్ట్ చేసుకున్న సినిమా కథలన్నీ డిజాస్టర్ గా మిగులుతున్న నేపథ్యంలో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమై.. మళ్ళీ మంచి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది.  మరి నెక్స్ట్ వచ్చే సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link