Naga Panchami 2024: నాగపంచమి ఎప్పుడు.. పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనులు ఏంటో తెలుసా..?

Mon, 05 Aug 2024-9:52 pm,

నాగులకు మన పురాణాల ఇతిహసాలలో ప్రముఖమైన స్థానం ఉంది. శివుడు పామును తన కంఠాభరణంగా ధరించాడు. అదే విధంగా విష్ణుమూర్తి శేషశయనంపై పవళిస్తుంటాడు. అంతేకాకుండా.. సుబ్రహ్మణ్యుడిని పాముకు ప్రతిరూపంగా చెబుతుంటారు. అందుకు పాములకు అపకారం తలపెట్టొద్దని పెద్దలు చెబుతుంటారు

నాగపంచమి పండుగను అనాదీనాగా జరుపుకుంటారు. ఈసారి నాగ పంచమి పండుగ ఆగస్టు 9 న వచ్చింది. ఈ రోజున.. పుట్టల దగ్గరకు వెళ్లి పాలుపోయాలని చెబుతుంటారు. జంట నాగుల విగ్రహాల మీద పాలు పోయాలి. సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్లాలి. నవనాగుల స్తోత్రాలను చదవాలి.

నాగ పంచమిరోజున చాలా మంది మహిళలు భక్తితో ఉపవాసం చేస్తుంటారు. కొందరు గోడల మీద కుంకుమతో.. నవనాగుల బొమ్మలను గీస్తారు. దానికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అంతేకాకుండా..ఆవుపాలతో అభిషేకం చేస్తారు.

ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోను పొలం పనులకు వెళ్లకూడదు. భూమిని తవ్వడం వంటి పనులు చేయకూడదు. కూరగాయలను కోయకూడదు. కత్తులు, కత్తెర వంటివి అస్సలు ఉపయోగించకూడదు. ఆరోజున కేవలం చేతితో విరిచేవి.. గోరు చిక్కుడు కూరగాయలను మాత్రమే చేయాలి.

పుట్ట దగ్గరకు వెళ్లి భక్తితో నమస్కరించాలి. అతిగా పుట్టలో పాలను పోయకూడదు.ముఖ్యంగా కాలసర్ప దోషం ఉన్న వారు ఈరోజున నాగ ప్రతిష్టాపన చేయించుకొవాలి. నాగ పూజ చేసుకుంటే పెళ్లిళ్లు తొందరగా కుదురుతాయి.

ఇటీవల కాలంలో చాలా మందిసరైన వయస్సులో పెళ్లిళ్లు కాకఅనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాలసర్పదోషం వల్ల.. వివాహాలు ఆలస్యం కావడం, పెళ్లైన సంతానంలేకపోవడం వంటివి ఉంటాయి. అందుకే నాగపంచమి ఈ దోషపరిహారానికి మంచిరోజుగా చెప్పవచ్చు.

నాగపంచమి రోజున చేసే ఏపూజ అయిన, వ్రతమైన కూడా వెయ్యిరెట్లు ఫలితం  ఇస్తుందని చెప్తుంటారు. అందుకే నాగ పంచమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను విధిగా పాటించాలి. దీంతో అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కల్గుతుంది. 

శివాలయాలు, విష్ణు ఆలయాలకు వెళ్లి ప్రత్యేకంగా నెయ్యితో దీపారాధన చేయాలి. ఈరోజు పేదలకు దాన, ధర్మాలు చేయాలి. సర్పాల అనుగ్రహాం కోసం స్తోత్రాలను పారాయణం చేయాలి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link