Balakrishna: గొప్ప మనస్సు చాటుకున్న బాలయ్య.. తెలుగు రాష్ట్రాలకు వరదల నేపథ్యంలో భారీ విరాళం.. ఎంతంటే..?
భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలలో తీరని లోటును మిగిల్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం వరద ప్రభావానికి ఎక్కువగా గురయ్యాయి.ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
మరోవైపు తెలంగాణ విషయాని వస్తే.. ఖమ్మంలో ఎప్పుడు చూడని విధంగా ఒక్కసారిగా వరద పొటెత్తింది. దీంతో వందల ఇళ్లు ఒక్కసారిగా వరదల్లో చిక్కుకునిపోయాయి. అంతేకాకుండా.. కనీసం తినడానికి తిండి, కట్టుకొవడానికి బట్టలు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు పర్యటించారు.
హైదరాబాద్ నగరం కూడా వర్షానికి అల్లకల్లోలంగా మారిపోయింది. ఎటు చూసిన వరద ప్రభావం వల్ల రోడ్లన్ని నీళ్లతో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైపోయాయి.
ఇక ఏపీ విషయానికి వస్తే విజయవాడలో వరద కల్లోలం మిగిల్చింది. సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి మంత్రులు, అధికారుల్ని సైతం ఉరుకులు పరుగులు పెట్టించారు. అంతేకాకుండా.. ఎక్కడ కూడా సహాయక చర్యలలో ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్తలు తీసుకొవాలని కూడా సూచించారు.
ఈ క్రమంలో తెలుగు స్టేట్స్ లలో సంభవించి విరాళాలకు తమ వంతుగా రాజకీయా ప్రముఖులు, సినీ ప్రముఖులు భారీగా విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా, తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు.
బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు తనవంతు బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటన చేశారు.
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించింది. అలాగే ‘ఆయ్’ చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకూ వచ్చే కలెక్షన్లలో 25 శాతం వరద బాధితులకు జనసేన పార్టీ ద్వారా విరాళంగా అందజేస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు. ఇప్పటికే.. జూనియర్ ఎన్టీఆర్ రూ. కోటి, విశ్వక్సేన్ రూ. 10 లక్షలను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా స్వచ్చంధంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.