Navaratri Maha Yogam: ఈ నవరాత్రుల్లో ఈ రాశుల వారిపై దుర్గామాత అపార కరుణ.. అష్టైశ్వర్యాలు వీరి వెంటే..

Wed, 18 Sep 2024-6:30 am,

మిథున రాశి..

మిథున రాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. నవరాత్రుల నుంచి వీరికి మంచి రోజులు రాబోతున్నాయి. ఏ పనిచేసిని అదృష్టం వీరి వెన్నంటి ఉంటుంది. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు ఇది యోగ కాలం.

కర్కాటక రాశి.. నవరాత్రి నుంచి కర్కాటక రాశి వారి జీవితంలో అప్పటి వరకు వారి జీవితంలో చోటు చేసుకొని మంచి జరుగుతుంది.  ఉద్యోగంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. మీ మనసు స్థిమిత పడుతుంది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.

సింహ రాశి..

అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. అన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలే మీ గెలుపుకు దోహదం చేస్తాయి.

కన్యారాశి.. కన్యా రాశి వారి జీవితం నవరాత్రుల నుంచి మంచి మలుపు తీసుకుంటుంది. ఆర్ధిక వ్యవహారాలు కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఈ సమయంలో మీకు తగినంత డబ్బు చేతికి అందుతుంది.  అంతేకాదు పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలమిస్తాయి.

తులా రాశి.. గత కొన్నేళ్లుగా మీరు అనుభవిస్తున్న అష్టకష్టాలు నవరాత్రుల నుంచి మటుమాయం కానున్నాయి. కొత్త తరహా జీవితంలో అడుగుపెడతారు. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న విజయాలు మీ వశం అవుతాయి. మనసులోని తీరని కోరికలు నెరవేరుతాయి. ఇంటి నిర్మాణాలు కలిసొస్తాయి.

ధనుస్సు రాశి..

ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అత్యంత శక్తివంతులవుతారు. అందరు మీ మాట ప్రకారం నడుచుకుంటారు. అనుకోని అవాంతరాలు తొలిగిపోతాయి. కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న డబ్బు మీ చేతికి అందుతుంది.

 

మీన రాశి.. నవరాత్రుల నుంచి  మీ కొత్త జీవితం మలుపు తీసుకుంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆస్తులు కలిసొస్తాయి. జీవితంలో  కోరుకున్న పనులు నెవవేరుతాయి.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్, జ్యోతిష్యులు ప్రస్తావించిన అంశాలనే మేము ప్రస్తావించాము. ZEE News దీనికి ధృవీకరించడం లేదు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link