NEET 2021 updates: నీట్ 2021 పరీక్షలు రద్దు చేస్తారా అనే సందేహాలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి

Thu, 10 Dec 2020-8:13 pm,

సీబీఎస్ఈ పరీక్షలు 2021, జేఈఈ మెయిన్ 2021, నీట్ 2021 పరీక్షల నిర్వహణ, తేదీలు విషయంలో విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ NEET 2021 రద్దు చేస్తారా అని విద్యార్థులు వ్యక్తంచేసిన సందేహాలపై కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పందిస్తూ.. కేంద్రానికి అటువంటి ఉద్దేశం ఏదీ లేదని అన్నారు. 

అనేక సవాళ్ల మధ్య NEET - JEE Exams నిర్వహించిన ఎన్టీఏను ( NTA ) కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ అభినందించారు.

కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో NEET 2021 exams ఇదివరకులా ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని విద్యార్థులు కోరగా.. విద్యార్థుల సూచనను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. 

JEE Main exams 2021 పరీక్షలు వివిధ సెషన్స్‌లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. జేఈఈ మెయిన్ ఏడాదిలో రెండుసార్ల కంటే ఎక్కువ.. అంటే మూడు లేదా నాలుగుసార్లు నిర్వహించే ప్రతిపాదనపై సమాలోచనలు జరుపుతున్నట్టు మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. 

అలాగే విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు జేఈఈ మెయిన్ 2021 పరీక్షలు సిలబస్ ( JEE Main 2021 Exams syllabus ) తగ్గించాలనే ప్రతిపాదనపైనా చర్చలు జరుగుతున్నట్టు మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ( Image courtesy : PTI ) 

సీబీఎస్ఈ పరీక్షలు ( CBSE 2021 Exams ) విషయంలో కరోనా కారణంగా విద్యార్థులు ల్యాబ్‌కు వెళ్లే పరిస్థితి లేకపోతే.. ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ నిర్వహణపైనా మరోసారి సమీక్ష చేపడతామని అన్నారు.

Also read : SSB Constables Recruitment 2020: ఎస్ఎస్‌బిలో 1522 ఉద్యోగాలు.. 10వ తరగతి పాస్ అయితే చాలు..

Also read : How to apply for MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

Also read : Christmas Star: ఆకాశంలో అరుదైన క్రిస్మస్ స్టార్.. ఇప్పుడు తప్పితే మళ్లీ ఎప్పుడో

Also read : Did Sonu Sood mortgage his properties: నిరుపేదలకు సాయం చేసేందుకు సోనూ సూద్ ఆస్తులు తనఖా పెట్టి రుణం తీసుకున్నాడా ?

Also read : Side effects of Vitamin D Tablets: కరోనాకు చెక్ పెట్టేందుకు విటమిన్ డి పిల్స్ వాడుతున్నారా ? ఐతే రిస్కే!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link